గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన హింసకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ టికాయత్. ఇది రైతులను అవమానించడమేనని అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోవాయాలో నిర్వహించిన 'కిసాన్ మహాపంచాయత్'లో ఆయన మాట్లాడారు. ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసలో నిందితులు కూడా ప్రభుత్వానికి చెందినవారేనని అన్నారు.
''దిల్లీలో హింస ప్రణాళికను స్వయంగా భాజపా ప్రభుత్వమే రూపొందించింది. ఇది రైతులను అవమానించడమే.''
- నరేశ్ టికాయత్, బీకేయూ అధ్యక్షుడు
రైతులకు అతిపెద్ద శత్రువు భాజపా ప్రభుత్వమేనని టికాయత్ విమర్శించారు. రైతులంతా ఏకం అవ్వాలని, లేదంటే వారు ఇంకా విధ్వంసానికి తెగిస్తారని ఆరోపించారు. శ్రీరాముని పేరు చెప్పి.. బంగాల్లో భాజపా ఓట్లు అడుగుతుందని అన్నారు.
''రైతులను ఉగ్రవాదులు, ఖలిస్థానీలు అని ఇంకా ఏదేదో అన్నారు. కానీ మేం ప్రభుత్వ వ్యతిరేకులం. మేం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం.''
- నరేశ్ టికాయత్, బీకేయూ అధ్యక్షుడు
ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు గాజీపుర్‌లోని నిరసన ప్రదేశానికి వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: