Pawan Kalyan letter to Prime Minister Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 5 పేజీల లేఖ రాశారు. కుంభకోణంపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో తక్షణమే విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan letter Details: ''రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగింది. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోంది. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయి. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికి మాత్రమే ఇళ్లు ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారు.'' అని పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.