ETV Bharat / bharat

జనసేన అవిర్బావ సభ.. వారాహిపై బయల్దేరిన జనసేనాని - అవిర్బావ దినోత్సవ సభ

Janasena Formation Day: జనసేన అవిర్భావ దినోత్సవ సభను మంగళవారం మచిలీపట్నంలో పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభలో హాజరు కావటానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అంతేకాకుండా జనసేన అధినేత విజయవాడ నుంచి వారాహి వాహనంపై ప్రజల ర్యాలీ నడుమ బయలుదేరారు.

pawan kalyan
pawan kalyan
author img

By

Published : Mar 14, 2023, 5:49 PM IST

Janasena Tenth Formation Day Celebrations: జనసేన పదో అవిర్భావ దినోత్సవ సభ మచిలీపట్నంలో నిర్వహిస్తోంది. సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ విజయవాడ నుంచి వారాహి వాహనంపై బయలుదేరారు. ఆయన వెెంట ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. ఈ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది.

సభ గురించి జనసేన గతంలో తెలిపిన విధంగా.. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ విజయవాడలోని ఆటోనగర్​కు చేరుకున్నారు. ఆటోనగర్​లో ఆయనకు భారీ స్వాగతం లభించింది. భారీ గజమాలతో పవన్‌ కల్యాణ్‌కు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి సభలో పాల్గొనటానికి అక్కడి నుంచి.. వారాహిలో మచిలీపట్నం బయలుదేరారు. ఆయనతో పాటుగా ప్రజలు సభకు ర్యాలీగా తరలివస్తున్నారు. పార్టీ కార్యకార్తలు, శ్రేణులకు అభివాదం తెలుపుతూ పవన్​ సభకు బయలుదేరారు.

సభకు తరలివెళ్తుండగా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. భారీ ర్యాలీతో బయలుదేరిన జనసేనాని మచిలీపట్నం అవిర్భావ సభలో పాల్గొననున్నారు. సభ ప్రారంభానికి ముందు వేదికపై కళాకారుల సంప్రదాయ నృత్యాలు కొనసాగుతున్నాయి. ఈ సభలో కౌలురైతుల కుటుంబసభ్యులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించనున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందించనున్నారు. సుమారు 47 కుటుంబాలకు ఈ సహాయం అందించనుండగా. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థికంగా ఆదుకోనున్నారు.

2014లో పార్టీ అవిర్భావం : 2014వ సంవత్సరంలో మార్చి 14వ తేదీన పవన్​ కల్యాణ్​ జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే ఎన్నికలు రావటంతో.. పోటీ చేయకుండా మిన్నకుండిపోయింది. కానీ, బీజేపీ, టీడీపీ పార్టీలు పొత్తుగా ఏర్పడగా.. వాటికి సంఘీభావంగా నిలిచింది. ఆ తర్వాత 2019వ సంవత్సరంలోని ఎన్నికలలో బీజేపీ, టీడీపీకి దూరంగా ఉండి.. బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఓటమిని చవిచూసింది.

రాబోయే ఎన్నికలలో జనసేన : ఈ సభలో పాల్గొనటానికి పవన్​ మచిలీపట్నంలోని సభా ప్రాంగణం వరకు ముఖ్యమైన కూడళ్ల వద్ద స్థానికుల్ని కలుసుకుంటూ.. ముందుకు సాగనున్నారని పార్టీ తెలిపింది. పవన్​ సాయంత్రం మచిలీపట్నం చేరుకున్న అనంతరం సభలో ప్రసగించనున్నట్లు వివరించింది. రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికలకు సంవత్సర కాలమే మిగిలి ఉండటంతో.. ఏ విధంగా ముందుకు దూసుకెళ్లాలి అనే అంశంపై, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, దిశానిర్దేశం చేయనున్నారని జనసేన తెలిపింది. పొత్తులపై కూడా పవన్​ ఈ సభలో ప్రస్తావించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర అంశాలలో పార్టీ వైఖరిని ప్రకటించే అవకాశముంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.