ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముష్కరుడు హతం - భారత్-పాక్​ సరిహద్దు సమస్య

పాక్​ నుంచి భారత్​లోకి చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. సమగ్ర నిఘా నెట్​వర్క్​తో ముష్కరుల కదలికలను నియంత్రిస్తున్నట్లు ప్రకటించింది.

Militant killed after Infiltration bid foiled in Rajouri: Officials
ఉగ్రవాది హతం
author img

By

Published : Jul 7, 2021, 11:05 PM IST

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. ఘటనా ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్.. నాలుగు మ్యాగజిన్లు, పేలుడు పదార్థాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. 'పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రవాదుల బృందం నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖమీదుగా చొరబడేందుకు యత్నించింద'ని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు.

సమగ్ర నిఘా గ్రిడ్‌ను ఉపయోగించి ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సైన్యం.. చొరబాటుదార్లను నియంత్రించేందుకు కాల్పులు జరిపినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.