ETV Bharat / bharat

కశ్మీర్​లో కూటమి హవా- జమ్ములో భాజపా జోరు

author img

By

Published : Dec 22, 2020, 8:57 AM IST

Updated : Dec 22, 2020, 3:06 PM IST

jk
జమ్ముకశ్మీర్​

14:54 December 22

జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల ఫలితాల్లో గుప్కార్​ కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 280 డీడీసీల్లో ఓట్ల లెక్కింపు సాగుతోంది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో కూటమి సత్తా చాటుతోంది. అయితే జమ్ము ప్రాంతంలో మాత్రం భాజపా దూసుకెళ్తోంది. కాంగ్రెస్​.. జమ్ము, కశ్మీర్​ రెండు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

13:50 December 22

కూటమి ఆధిక్యం.. కానీ

జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో గుప్కార్​ కూటమి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యంగా కశ్మీర్​ ప్రాంతంలో ఈ కూటమి ప్రజల మద్దతును పొందుతోంది. అయితే ఈ ఎన్నికల్లో భాజపా బలంగా పుంజుకుంది. కశ్మీర్​లో వెనకబడినా.. జమ్ము ప్రాంతంలో మాత్రం తన జోరు కొనసాగిస్తోంది. భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే.. గుప్కార్​ కూటమి- భాజపా మధ్య వ్యత్యాసం తక్కువే ఉండటం వల్ల మిగిలిన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.

11:43 December 22

భాజపా హవా..

జమ్ముకశ్మీర్​ స్థానిక పోరులో భాజపా హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో విజయంవైపు దూసుకుపోతోంది. ఇక్కడ గుప్కార్​ కూటమికి భాజపాకు చాలా వ్యత్యాసం కనపడుతోంది. అయితే కశ్మీర్​లో గుప్కార్​ కూటమి మెరుగ్గా ఉన్నప్పటికీ.. భాజపా కొద్దిపాటి దూరంలోనే ఉండటం కమలదళానికి సానుకూల విషయం. 

11:00 December 22

జమ్ములో భాజపా జోరు..

జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేకెతిస్తున్నాయి. జమ్ము ప్రాంతంలో భాజపా దూసుకుపోతోంది. అనేక చోట్ల ఆధిక్యంలో ఉంది కమలదళం. అయితే కశ్మీర్​లో మాత్రం భాజపాకు గుప్కార్​ కూటమి నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ ప్రాంతంలో గుప్కార్​ కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉంది. 

09:01 December 22

  • Jammu and Kashmir: Counting of votes for 280 constituencies of District Development Council (DDC) underway at Sher-I Kashmir International Conference Centre in Srinagar.

    Visuals of heavy security deployment outside the counting centre. pic.twitter.com/li1S54vJaI

    — ANI (@ANI) December 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఓట్ల లెక్కింపు షురూ..

జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

మొత్తం 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్ కౌన్సిల్​ (డీడీసీ)లకు మొత్తం 8 విడతల్లో పోలింగ్​ జరిగింది.

08:40 December 22

కశ్మీర్​ ఎన్నికల ఫలితాలు

  • Jammu and Kashmir: Counting of votes for 280 constituencies of District Development Council (DDC) to begin shortly; visuals from outside the counting centre in Doda district. pic.twitter.com/zgMYT73wA4

జమ్ముకశ్మీర్​ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతేడాది ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం.. తొలిసారిగా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్​ పంచాయతీరాజ్​ చట్టంలోని 73వ సవరణను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా.. జమ్ముకశ్మీర్​లోని మొత్తం 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్ కౌన్సిల్​ (డీడీసీ)లను ఏర్పాటు చేశారు. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు మొత్తం 8 విడతల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఫలితంగా జమ్ముకశ్మీర్​లో సరికొత్త అధ్యాయం మొదలైంది.  మంగళవారం ఉదయం 9గంటల నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో డీడీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 

జమ్ముకశ్మీర్​ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల ఫలితాల కోసం యావత్​ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Dec 22, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.