ETV Bharat / bharat

44ఏళ్ల హౌస్​వైఫ్​.. వీడియో గేమ్స్​ ఆడటంలో క్వీన్.. ఫన్​తోపాటు లక్షలు ఆదాయం!

author img

By

Published : Mar 24, 2023, 6:44 PM IST

ప్రొఫెషనల్​ గేమింగ్​ యాప్స్​లో ఆటలు​ ఆడుతూ కొన్నేళ్లుగా లక్షలు సంపాదిస్తున్నారు జమ్ముకశ్మీర్​కు చెందిన 44 ఏళ్ల మహిళ. ఆమె కథ మీకోసం..

jammu homemaker become a lady gamer latest news
గేమింగ్ యాప్​లతో లక్షలు సంపాదిస్తున్న జమ్ముకశ్మీర్ 44 ఏళ్ల మహిళ

ప్రస్తుత రోజుల్లో ఆన్​లైన్​ గేమింగ్​ యాప్​ల గురించి పెద్దల కంటే పిల్లలకే బాగా అవగాహన ఉంది. అయితే ఈ గేమ్స్​ విరివిగా ఆడేవారిలో ఎక్కువగా చదువుకునే విద్యార్థులు లేదా యువతనే చూస్తుంటాము. కానీ, జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ మహిళ మాత్రం కొన్నేళ్లుగా వీటిని ఆడుతున్నారు. అంతేగాక వీటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

జమ్ముకశ్మీర్​కు చెందిన రీతు స్లాతియాకు 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమెకు 44 సంవత్సరాలు. గృహిణిగా ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని మిగతా సమయంలో గేమింగ్​ యాప్​లో లైవ్​ స్ట్రీమింగ్​ ఇస్తున్నారు. వీటి ద్వారా ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలకు పైగా డబ్బును ఆర్జిస్తున్నారు. అంటే నెలకు కచ్చితంగా రూ.10 వేలు ఇంట్లో ఉండే సంపాదిస్తున్నారు రీతు.

"నా చిన్నతనంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలతో నేను 12 తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు చాలా చిన్న వయస్సులోనే వివాహం చేశారు. నాకు పెళ్లయి దాదాపు 25 సంవత్సరాలు గడుస్తుంది. నా భర్త, కుమారుడు అన్ని విషయాల్లో నన్ను ఎల్లపుడూ ప్రోత్సహిస్తుంటారు. నేను ఇంట్లో పని చేసుకుంటున్న సమయాల్లో నా కొడుకు ఎప్పుడూ ఫోన్లో గేమ్స్​ ఆడడం గమనించేదాన్ని. ఈ క్రమంలోనే వాటి గురించి అడిగి తెలుసుకుని.. నేను కూడా ఆడాలనే ఆసక్తి నాలో పెరిగింది. కానీ, వయసురీత్యా ఇది ఎలా ఆడతారో అని అడగటానికి కాస్త మోహమాటపడేదాన్ని. చివరకు 2019లో నా కుమారుడ్ని ఈ గేమ్స్​​ గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాను. వాడే దగ్గరుండి గేమ్స్ ఎలా ఆడాలో నేర్పించాడు. ఇక అప్పట్నుంచి గేమ్స్​ ఆడటంలో నా ప్రస్థానం మొదలైంది." అని తెలిపారు రీతు స్లాతియా

"నేను మొదట్లో బీజీఎమ్​ఐ(బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా)అనే గేమ్ ఆడేదాన్ని. ఈ గేమ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఫ్రీఫైర్​ కూడా ఆడటం ప్రారంభించాను. కొద్దిరోజుల్లోనే వీటిల్లో ఆరితేరాను. ఇలా ఒకరోజు నా కుమారుడు గేమ్‌ప్లేలో లైవ్​ ద్వారా ఇతరులతో మాట్లాడటం కూడా నేను చుశాను. ఇది నాలో గేమ్స్​ గురించి మరింత తెలుసుకోవాలన్న ఉత్సుకతను మరింత పెంచింది. అప్పుడు ఈ లైవ్​ ఎలా మాట్లాడతారని కూడా వాడ్నే అడిగి తెలుసుకున్నా. ఇలా ఒక్క సంవత్సరంలోనే అన్ని విషయాలను నేర్చుకున్నా. అనంతరం ఆన్​లైన్​ గేమింగ్​ లైవ్ స్ట్రీమింగ్​ ఇవ్వడం ప్రారంభించా. లైవ్​ ఇచ్చే సమయాల్లో నా కుమారుడి వయసున్న పిల్లలతో పాటు మరికొంతమంది నా లైవ్​ను చూస్తూ.. నన్ను అనుసరించడం ప్రారంభించారు."
- రీతు స్లాతియా

ఇదిలా ఉంటే గేమ్స్​ ఆడటం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటం గురించి తన స్నేహితులకు, బంధువులకు చెప్పేవారు రీతు. ఇందుకు వారు నవ్వేవారు కూడా. ఇవ్వన్నీ పిల్లల కోసమని.. వృద్ధ మహిళలకు కాదని వారు హేళన చేసేవారు. దీని ద్వారా తను డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పినప్పటి నుంచి వారే రీతు పెట్టే గేమ్​ లైవ్​ స్ట్రీమ్​ను చూస్తూ ఆదరిస్తున్నారు. అంతేగాక వారూ గేమ్స్ ఆడటం మొదలుపెట్టారు.

jammu homemaker become a lady gamer latest news
బీజీఎమ్​ఐ, ఫ్రీఫైర్​ గేమ్స్​ ఆడుతున్న రీతు స్లాతియా. Picture credit: Rooter

"ఈ గేమింగ్​ ప్లాట్​ఫామ్​తో వచ్చే డబ్బు చిన్న మొత్తమే అయినా దీని ద్వారా లభించే ఆత్మవిశ్వాసం, ధైర్యం నాకు సాటిలేనివి. ఈ యాప్​లో అనేక ప్రదేశాల నుంచి ఎందరో భిన్నమైన వ్యక్తులు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇది నాకెంతో ఆనందాన్ని, శక్తినిస్తుంది. ప్రొఫెషనల్​ గేమింగ్​ యాప్​ అనేది ఎక్కువ శ్రమ లేకుండా డబ్బును సంపాదించేలా చేస్తుంది. దీంతో పాటు మహిళలను సరదాగా గడిపేలా చేస్తుంది. పెద్దగా చదువుకోకున్నా ఇంట్లోనే ఉంటూ ఇలాంటి పద్ధతుల్లో కొంత డబ్బును సంపాదిస్తూ గృహిణి తన కాళ్ల తను నిలబడటం చాలా మంచిది. దీనిని నేను ప్రతి ఇల్లాలికి ప్రయత్నించమని సూచిస్తాను" అని చెబుతున్నారు రీతు స్లాతియా.

రోజూ రీతు ఇంట్లోని పూజ, వంట, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులను ఉదయం 8 గంటలలోపు పూర్తి చేసుకుంటారు. అనంతరం సరిగ్గా 8 గంటలకు రీతు కంప్యూటర్ సిస్టమ్​ ముందు కూర్చుంటారు. తర్వాత గేమ్​ప్లేను మొదలుపెట్టి రూటర్​ అనే వెబ్​సైట్​లో లైవ్​ను ప్రారంభిస్తారు. అప్పటికే రీతు లైవ్​ కోసం వేలాది మంది ఫాలోవర్లు, స్నేహితులు ఆన్​లైన్​లో ఆమె కోసం ఎదురుచూస్తుంటారంటే రీతుకు ఉన్న క్రేజ్​ను అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ గేమ్స్ ద్వారా రీతు స్లాతియా ఆదాయాన్ని పొందుతున్నారు. Picture credit: Rooter

గృహిణి నుంచి గేమర్​ దాకా..
విమెన్​ గేమర్​గా ఉన్న రీతును యాప్​లో అందరూ సరదాగా 'మమ్మా బ్లాక్‌బర్డ్' అనే పేరుతోనే గుర్తుపడతారు, పిలుస్తారు. ఎందుకంటే అధికారికంగా ఆమె ప్రొఫైల్​ పేరు ఇదే కాబట్టి. ఆన్​లైన్​ గేమింగ్​ ప్లాట్​ఫామ్​ అయిన రూటర్​ అనే యాప్​లో రీతుకు సుమారు 3.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం దీంట్లో ఇంత నైపుణ్యం సంపాదించడానికి తన కుమారుడే కారణమని చెబుతారు రీతు. అయితే రీతు ఇచ్చే లైవ్​ స్ట్రీమింగ్​ను స్పష్టమైన జమ్ము హిందీ భాషలో కూడా ఇస్తారు. మున్ముందు మరిన్ని గేమ్స్​ను నేర్చుకుని దీనిని ఇలాగే కొనసాగిస్తానని చెబుతున్నారు రీతు. ఈ ఆన్​లైన్​ గేమింగ్​ యాప్​ ద్వారా తాను మానసికంగా పొందే అనందంతోపాటు వీటి ద్వారా వచ్చే సొమ్ముతో ఆర్థిక స్వేచ్ఛను కూడా అనుభవిస్తున్నానని చెబుతున్నారు రీతు. ఇలా ఓ మంచి భార్యగా, తల్లిగా, గృహిణిగా ఉంటూనే తాను అనుసరిస్తున్న ఈ విధానాన్ని మిగతా మహిళలకు కూడా సూచిస్తున్నారు రీతు.

ఆన్​లైన్​ గేమింగ్​ యాప్​లో లైవ్​ ఇస్తున్న రీతు స్లాతియా. Picture credit: Rooter

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.