Jaipur gang rape: రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో గురువారం ఒక్కరోజే నాలుగు అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి. మాల్పురా గేట్, ఆమేర్, సాంగానేర్, ముహానా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఘటనలు జరిగాయి. మాల్పూర్ గేట్ రేప్ కేసులో సొంత భర్తే రూ.5వేలు తీసుకుని భార్యను ఇద్దరు వ్యక్తులకు అప్పగించాడు. డిసెంబర్ 19న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. తన భర్త రూ.5వేలకు ఇద్దరు వ్యక్తులతో డీల్ కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం వాళ్లతో ఆమె గడపాలి. ఇంటికి వచ్చిన ఇద్దరినీ చూసి బాధితురాలు షాక్ అయ్యింది. ఎవరు వీళ్లు అని భర్తను అడిగింది. ఆ ఇద్దరితో గడపాలని భర్త చెప్పాడు. అందుకు ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో భర్త, ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను కొట్టి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. ఇద్దరు నిందితుల పేర్లు గణపత్, భోలారాం అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు అడ్డువచ్చిన కుమారుడ్ని కూడా కొట్టారని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నడుస్తున్న కారులో...
ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో మరో అత్యాచార ఘటన జరిగింది. నడుస్తున్న కారులో 18 ఏళ్ల యువతికి బలవంతంగా మద్యం తాగించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీసి ఎవరికైనా చెబితే లీక్ చేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు కృష్ణ, హేమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 19న ఈ ఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల కృష్ణ బాధిత యువతిని 6 నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ చేసుకున్నాడు. డిసెంబర్ 19న ఆమెను కలిసేందుకు రమ్మన్నాడు. స్నేహితుడు హేమంత్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రిని బ్లాక్మెయిల్ చేసిన గ్యాంగ్ అరెస్ట్