కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్లుగా తిహాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు అల్తాఫ్. అతడి మరణవార్తను కుమార్తె రువాషా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొంతకాలంగా అల్తాఫ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
అంతకుముందు మెరుగైన వైద్యం కోసం అల్తాఫ్‌ను ఎయిమ్స్‌కు తరలించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తన తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది ఆయన కుమార్తె రువాషా. జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి.. అల్తాఫ్ స్వయానా అల్లుడు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో 2017లో అల్తాఫ్ అరెస్ట్ అయ్యాడు.
ఇవీ చదవండి: 'విద్వేష ప్రసంగాలపై మీ వాదన సబబే కావొచ్చు'.. తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం
బహిర్భూమికి వెళ్లి గంగా నదిలో పడ్డ వృద్ధురాలు.. 40 కిలోమీటర్లు కొట్టుకుపోయి..