ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్ ఎన్​కౌంటర్​

JK Encounter: జమ్ముకశ్మీర్​ అనంతనాగ్ జిల్లాలో ఎన్​కౌంటర్ జరిగింది. బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు హతమయ్యారు. అమర్​నాథ్​ యాత్ర మార్గంలో ఎన్​కౌంటర్ తమకు పెద్ద విజయమని కశ్మీర్ ఐజీపీ విజయ కుమార్ తెలిపారు.

Anantnag Encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : May 6, 2022, 4:22 PM IST

Anantnag Encounter: జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అటీవీ ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్​ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమర్​నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్​కౌంటర్ తమకు అతిపెద్ద విజయం అని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్ తెలిపారు.

సరిహద్దులో 200 మంది ఉగ్రవాదులు: జమ్ముకశ్మీర్​లో చొరబడేందుకు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దులో నక్కి ఉన్నట్లు ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయితే గతంతో పోల్చితే ఉగ్రవాద చొరబాట్లు భారీగా తగ్గాయని తెలిపారు. అలాగే 2021 ఫిబ్రవరి నుంచి ఇరుదేశాల అంగీకారం ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కూడా పకడ్బందీగా అమలవుతోందని చెప్పారు.

ఇదీ చదవండి: 90ఏళ్ల బామ్మను సాకలేక పెట్రోల్​ పోసి నిప్పంటించిన మనవరాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.