ETV Bharat / bharat

'సైలెంట్ మోడ్​లోకి వెళ్లిన మోదీ, షా'

దేశంలో కొవిడ్​ విజృంభణ వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. సైలెంట్​మోడ్​లోకి వెళ్లిపోయారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బతికుండటానికే పోరాటం చేసే దుస్థితికి ప్రజలను తీసుకొచ్చారని, అందుకు వారిదే పూర్తి బాధ్యత అని వ్యాఖ్యానించారు.

Yechury
'సైలెంట్ మోడ్​లోకి వెళ్లిపోయిన మోదీ, షా'
author img

By

Published : May 11, 2021, 5:40 AM IST

Updated : May 11, 2021, 6:47 AM IST

దేశంలో కరోనా రెండో ఉద్ధృతి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని, కానీ వారు సైలెంట్ మోడ్​లోకి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉన్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఈమేరకు ఫేస్​బుక్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

"శాస్త్రీయమైన విధానాలను తిరస్కరించి మూఢ విశ్వాసాల కోసం మీరు(ప్రధాని) ప్రజాధనాన్ని వృథా చేశారు. ఆసుపత్రుల కన్నా మీ నూతన నివాస నిర్మాణానికే ప్రాధాన్యమిచ్చారు. సూపర్ స్ప్రెడర్‌గా పరిణమించే కార్యక్రమాలకు మీరు ప్రజలను ఆహ్వానించారు. భారీ ఎత్తున ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో విఫలమయ్యారు. విదేశాలు పంపిన వైద్య సామగ్రి గోడౌన్లలో వారాల తరబడి నిలిచిపోయేలా వ్యవహరించారు. ప్రజలకు సరిపడా టీకాలు కొనలేకపోయారు."

-సీతారాం ఏచారి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

విధానాల రూపకల్పన, ప్రణాళికల కన్నా ప్రచారం పైనే మోదీ-షా దృష్టి పెట్టారని ఏచూరి విమర్శించారు. బతికుండటానికే పోరాటం చేసే దుస్థితికి ప్రజలను తీసుకొచ్చారని, అందుకు వారిదే పూర్తి బాధ్యత అని చెప్పారు. 'రాజ్యాంగం ప్రకారం మీరు పదవి చేపట్టారు. కాబట్టి, రాజీనామా చేసేవరకూ మీరు బాధ్యతలను విస్మరించలేరు' అని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచ వనరుల నుంచి టీకాలు సేకరించాలి. అందుకు బడ్జెట్లో టీకాల ఉత్పత్తికి కేటాయించిన రూ.35 వేల కోట్లను వినియోగించాలి. సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని ఆపి ఆ నిధులను ఆక్సిజన్ సరఫరా, టీకా పంపిణీకి మళ్లించాలి. పీఎం-కేర్స్ నిధులనూవిడుదల చేయాలి" అని ఏచూరి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'సెంట్రల్​ విస్టా వ్యయంతో 62 కోట్ల టీకా డోసులు'

Last Updated : May 11, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.