ETV Bharat / bharat

స్కూల్​లో భారీ చోరీ.. 'త్వరలో ధూమ్-4' అంటూ దొంగల మెసేజ్ - navarangapur news

ఒడిశాలో కొందరు దొంగలు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఓ పాఠశాలకు చెందిన కంప్యూటర్లు దోచుకెళ్లి.. బ్లాక్​బోర్డు పైన 'త్వరలోనే ధూమ్-​4 రాబోతుంది' అని రాశారు. వివరాల్లోకి వెళితే..

Its me Dhoom-4
author img

By

Published : Jul 4, 2022, 10:35 AM IST

ఒడిశాలోని నవరంగ్​పుర్​లో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రథయాత్ర సందర్భంగా సెలవును అదనుగా తీసుకుని స్థానిక పాఠశాలలోకి చొరబడి కంప్యూటర్లు తదితర సామగ్రిని దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా తరగతి గదుల బ్లాక్​బోర్డులపై 'ధూమ్-4 త్వరలోనే రాబోతుంది' అంటూ రాశారు. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి అది చూసిన ఉపాధ్యాయులు అవాక్కై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Its me Dhoom-4
బోర్డు మీద దొంగల స్టేట్​మెంట్​

అసలేం జరిగిందంటే?.. శుక్రవారం పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం నవరంగ్​పుర్​ పాఠశాలకు ఉపాధ్యాయులు రాగా.. బయట తలుపులకు వేసి ఉన్న తాళాలు పగిలి ఉండడం గమనించారు. లోపలకి వెళ్లి ప్రిన్సిపల్​ గది చూసేసరికి కంప్యూటర్లు, జిరాక్స్​ యంత్రాలు కనిపించలేదు. సౌండ్​ బాక్సులు సహా పలు సామాన్లు చోరీకి గురయ్యాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న తరగతి గదుల బ్లాక్​బోర్డులపై దొంగలు రాసింది చూసి అందరూ అవాక్కయ్యారు. 'త్వరలోనే ధూమ్​-4 రాబోతుంద'ని దొంగలు బోర్డు మీద రాశారు.

Its me Dhoom-4
బ్లాక్​ బోర్డు మీద దొంగల స్టేట్​మెంట్​

అయితే దొంగలు ఎత్తుకెళ్లిన కంప్యూటర్లలో విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు, పరీక్ష పేపర్లు, పాఠశాల సమాచారం ఉందని ప్రిన్సిపల్​ తెలిపారు. పాఠశాల యాజమాన్యం ఖతీగూడ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు.. సైంటిఫిక్ టీమ్, డాగ్​ స్క్వాడ్​ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో నందహండి బ్లాక్‌లోని దహన్‌ స్కూల్‌ ఆఫీసు రూమ్​లో ఉన్న కంప్యూటర్లను దొంగలు దోచుకెళ్లారు. ఆ తర్వాత బ్లాక్‌బోర్డ్‌పై కొన్ని మొబైల్ నంబర్లు కూడా రాశారు. వాటిలో ఆ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడి ఫోన్​ నెంబర్​ కూడా ఉంది. అది చూసిన పాఠశాల ఉపాధ్యాయులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఇవీ చదవండి: 'ఐదు రూపాయల డాక్టర్​'.. పెద్దాసుపత్రిలో నయంకాని రోగాలూ మాయం!

ముఖ్యమంత్రిని కాల్చేస్తా.. మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.