ETV Bharat / bharat

ఐటీబీపీ సిబ్బందికి జూడో, కరాటే, మార్షల్ ఆర్ట్స్​లో ట్రైనింగ్​- చైనా జవాన్లే టార్గెట్! - ఐటీబీపీ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ

చైనా సైన్యంతో చోటు చేసుకున్న గల్వాన్‌ ఘర్షణ అనుభవాల దృష్ట్యా వాస్తవాధీన రేఖ వద్ద పహారాకాసే ఐటీబీపీ జవాన్లకు మూడు నెలల పాటు సరికొత్త శిక్షణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. జూడో, కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ సహా విభిన్నమైన నిరాయుధ పోరాట రీతుల్లో ముమ్మర శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పోరాట నైపుణ్యాలు చైనా సైనికులను కదలనీకుండా, అసమర్థులుగా చేస్తాయని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరపకుండా చైనా సైనికులను చిత్తు చేసే సరికొత్త ఆయుధాలను భారత్‌ తయారు చేసింది.

ITBP
ఐటీబీపీ
author img

By

Published : Oct 30, 2022, 2:32 PM IST

2020 జూన్‌లో గల్వాన్‌ ఘర్షణ అనుభవాల దృష్ట్యా చైనా సరిహద్దు వద్ద పహారా కాసే ఇండో-టిబెటన్‌ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బందికి సరికొత్త శిక్షణను ప్రవేశపెట్టారు. గల్వాన్‌ ఘర్షణ వంటివి తలెత్తినప్పుడు ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. 15 నుంచి 20 వరకు పోరాట రీతులను ఈ శిక్షణలో భాగంగా జవాన్లకు నేర్పుతారు. జూడో, కరాటే, క్రావ్ మాగా వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ టెక్నిక్స్‌తో పాటు ప్రత్యర్థులను పంచ్‌ చేయడం, కిక్‌ చేయడం, విసిరివేయడం, కిందకు పడేయడం వంటి యుద్ధ కళల్లో శిక్షణ ఇస్తారు. ఐటీబీపీలో చేరేవారికి తొలుత ఈ శిక్షణ ఇచ్చి విధుల్లోకి చేర్చుకుంటారు.

ఈ కొత్త నిరాయుధ పోరాట రీతుల్లో తమను తాము రక్షించుకోవడం సహా ఎదురుదాడికి దిగే నైపుణ్యాలను నేర్పుతారు. గల్వాన్‌ ఘర్షణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాదే ఈ సరికొత్త శిక్షణ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు.ఈ పోరాట నైపుణ్యాలు ప్రత్యర్థిని కదలకుండా, అసమర్థులుగా చేస్తాయని అధికారులు తెలిపారు.

వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు జరపకూడదనే ఒప్పందం ఉండడం వల్ల గల్వాన్‌ ఘర్షణ సందర్భంగా చైనా సైనికులు భారత జవాన్లపై రాళ్లు విసిరారు. ఇనుప కడ్డీలు, ముళ్లతో కూడిన కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో 20 మందికిపైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమవైపు నలుగురు సైనికులను కోల్పోయినట్లు చైనా ప్రకటించినప్పటికీ ఆ సంఖ్య 45 వరకు ఉంటుందని రష్యా అధికార వార్తా సంస్థ టాస్‌ తెలిపింది.

అమెరికా నిఘా సంస్థ నివేదిక ప్రకారం గల్వాన్‌ ఘర్షణల్లో చైనా 35 మంది వరకు సైనికులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవాధీన రేఖ వద్ద మోహరించే ఐటీబీపీ సిబ్బందికి సరికొత్త పోరాట రీతులను నేర్పుతున్నారు. ఇప్పటికే ఈ తరహా ఘర్షణల్లో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు సరికొత్త ఆయుధాలను కూడా భారత్‌ సిద్ధం చేసుకుంది. 3,448 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వద్ద దాదాపు లక్ష మంది ఐటీబీపీ సిబ్బంది పహారాకాస్తారు. 2020లో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్నప్పటి నుంచి సైన్యాన్ని కూడా వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌ మోహరించింది.

ఇవీ చదవండి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్​.. ఆ పార్టీ అవకాశం ఇస్తే పోటీ!

కుమార్తెను ప్రేమించాడని సుపారీ ఇచ్చి హత్య.. 33 రోజుల తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.