ETV Bharat / bharat

చైనా సరిహద్దుల్లోకి ఐటీబీపీ ఇంజినీరింగ్‌ విభాగం

author img

By

Published : Nov 8, 2021, 7:36 AM IST

లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని తన శిబిరాలకు చేరుకునేందుకు ఉద్దేశించిన అనుసంధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భారత్‌- టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ)(Itbp Latest News) కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి నిర్దిష్ట ప్రాంతాల్లో రోడ్డు, నడక మార్గాలను నిర్మించడానికి తన ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగాన్ని వినియోగించాలని తొలిసారిగా నిర్ణయించింది.

itbp engineering wing
ఐటీబీపీ ఇంజినీరింగ్‌ విభాగం

చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ)(Line Of Actual Control) వెంబడి నిర్దిష్ట ప్రాంతాల్లో రోడ్డు, నడక మార్గాలను నిర్మించడానికి తన ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగాన్ని నియోగించాలని భారత్‌- టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ)(Itbp Latest News) తొలిసారిగా నిర్ణయించింది. తద్వారా లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని తన శిబిరాలకు చేరుకునేందుకు ఉద్దేశించిన అనుసంధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన నేవథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

భారత్‌-చైనా సరిహద్దు రోడ్ల ప్రాజెక్టుల్లోని రెండో దశలో 32 రోడ్లకుగాను నాలుగింటిని, ప్రభుత్వం మంజూరు చేసిన 18 నడక మార్గాల్లో రెండింటిని నిర్మించే బాధ్యతను ఐటీబీపీ(Itbp Latest News) చేపట్టిందని అధికారులు తెలిపారు. లద్దాఖ్​ ప్రాంతంలో ఎల్‌ఏసీ వెంబడి ఉన్న రోడ్లలో ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పొడవైన మార్గాల బాధ్యతను తీసుకున్నట్లు పేర్కొన్నారు. నడక మార్గాలు అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతంలో ఉన్నాయని వివరించారు. పదాతి దళాల గస్తీకి వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఈ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ బాధ్యతలను సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్‌వో), కేంద్ర ప్రజా పనుల విభాగం(సీపీడబ్యూడీ) చేపడుతుంటాయి. అయితే వీటిని వేగవంతం చేసే ఉద్దేశంతోనే తమ ఇంజినీరింగ్‌ విభాగాన్ని రంగంలోకి దించినట్లు ఐటీబీపీ అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

జమ్ముకశ్మీర్​లో పోలీస్​ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

'ఆపరేషన్​ సిలిగుడి'తో భారత్​పై చైనా కొత్త కుట్రలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.