ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాను సురక్షితంగా నిర్వహిస్తామని ఐటీబీపీ, సీఏపీఎఫ్, ఉత్తరాఖండ్ పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు 'హర్ కీ పౌడీ' ఘాట్ వద్ద సమావేశమై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాధారణంగా మూడు నెలలపాటు జరిగే కుంభమేళాను చరిత్రలో తొలిసారిగా నెలరోజులు మాత్రమే నిర్వహించనున్నారు. కరోనా నెగెటివ్ రిపోర్టు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
ఇదీ చదవండి: శివరాత్రి వేళ హరిద్వార్‌లో 'షాహి స్నాన్'