ETV Bharat / bharat

ఆ పార్టీ నేత ఇంట్లో రూ.150 కోట్ల నల్లధనం! - Crores detected in UP income tax raid

IT raids Samajwadi party: నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సమర్పించి భారీగా జీఎస్​టీ ఎగవేతకు పాల్పడిన ఓ ఉత్తరప్రదేశ్‌ పర్ఫ్యూమ్​ వ్యాపారి గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్‌ కాన్పుర్‌లోని ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించిన జీఎస్​టీ, ఆదాయపన్ను అధికారులు ఏకంగా రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టల లెక్కింపు​ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. గుట్టలు గుట్టలుగా బయటపడిన డబ్బు కట్టలను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు.

IT raids UP businessmen
IT raids UP businessmen
author img

By

Published : Dec 24, 2021, 1:40 PM IST

Updated : Dec 24, 2021, 5:30 PM IST

IT raids Samajwadi party: దేశంలో మరో భారీ జీఎస్​టీ మోసం బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన పీయూష్‌ జైన్‌ అనే పర్ఫ్యూమ్​ వ్యాపారి తప్పుడు బిల్లులతో పాల్పడిన భారీ పన్ను ఎగవేతను జీఎస్​టీ, ఐటీ అధికారులు బయటపెట్టారు. నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడి పీయూష్‌ కూడబెట్టిన దాదాపు రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. గురువారం దాడులు నిర్వహించిన అధికారులు శుక్రవారం ఉదయం వరకు లెక్కించి ఆ డబ్బు విలువను రూ.150 కోట్లుగా తేల్చారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు వివరించారు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్​ బోర్డు(సీబీఐసీ) ఛైర్మన్​ వివేక్​ జోహ్రి.

IT raids UP businessmen
గుట్టల గుట్టలగా బయటపడిన నల్లధనం

సీబీఐసీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బయటపడటం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. వ్యాపారవేత్త పీయూష్​ జైన్​కు చెందిన త్రిమూర్తి ఫ్రాగ్రెన్స్​కు సంబంధించి వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. శిఖర్ పాన్ మసాలా కంపెనీ యజమాని ప్రవీణ్ జైన్‌కు చెందిన పలుచోట్ల కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది.

పాన్​ మసాలా, త్రిమూర్తి కంపెనీ గుట్కా తయారుచేసి ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా పన్ను కట్టకుండా ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారని అధికారులు చెప్పారు.

పీయూష్‌ జైన్‌ ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు యంత్రాలను కూడా అధికారులు గుర్తించారు. ఆయన నోట్ల కట్టలను రెండు బీరువాల్లో నిండా పేర్చారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. పీయూష్​ ఇంట్లోనే కుప్పలుగా పోసి లెక్కించారు. ఆ నోట్లను తరలించేందుకు పదుల సంఖ్యలో భారీ పెట్టెలను కూడా సిద్ధం చేశారు.

IT raids Samajwadi party
బీరువాల్లో భారీగా డబ్బు

అధికారుల అదుపులో పీయూష్​ కుమారుడు..

పీయూష్​ జైన్​ కుమారుడు ప్రత్యూష్​ జైన్​ అధికారులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

IT raids Samajwadi party
పీయూష్​ జైన్​ కుమారుడు ప్రత్యూష్​ జైన్​
IT raids Samajwadi party
ప్రత్యూష్​ జైన్​ను తీసుకెళ్తున్న అధికారులు

సమాజ్​వాదీ పార్టీ నేత

పీయూష్‌.. సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సమాజ్‌వాదీ సెంట్‌ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు. ఈ కేసుకు సంబంధించి కాన్పుర్‌ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్‌, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ఎస్పీకి ఎదురుదెబ్బ!

మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ సమాజ్‌వాదీ పార్టీతో సంబంధం ఉన్న నేత ఇంట్లో భారీగా డబ్బులు బయటపడడం సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయ కలకలం సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి: రియల్​ లైఫ్​లో 'ఉప్పెన సీన్'.. ఆమెను ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేసి..

Last Updated : Dec 24, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.