తమిళనాడులో తమ పార్టీ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితం అయ్యే అవకాశముందని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ ఆరోపించారు. తిరుపుర్‌లో.. ఎంఎన్ఎం పార్టీకి చెందిన ఓ నేత నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులపై ఆదాయపు పన్ను విభాగం(ఐటీ) వివరాలు సమర్పించిన తర్వాత ఈ విషయమై స్పందిస్తానని కమల్ తెలిపారు.
త్వరలోనే పార్టీ మేనిఫెస్టోని విడుదల చేస్తామన్న కమల్.. రెండేళ్ల క్రితం తాను చెప్పిన అంశాలన్నీ అందులో ఉంటాయన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలపై తీవ్ర దుమారం