అసెంబ్లీ ఎన్నికల వేళ ఆదాయ పన్ను శాఖ తమిళనాడులోని పలు చోట్ల దాడులు నిర్వహించి, లెక్కల్లో చూపని రూ.16కోట్లు స్వాధీనం చేసుకుంది. దీంతో కలిపి ఎన్నికల సీజన్లో ఇప్పటి వరకు రూ.80కోట్లు జప్తు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.


మార్చి16, 17 తేదీల్లో చెన్నై, తిరుప్పూరు, ధర్మపురం ప్రాంతాల్లో టైక్స్‌టైల్, తదితర సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఎన్నికల వేళ ఎలాంటి డబ్బు పంపకాలు జరగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: ఒంటిపై 4 కేజీల బంగారు ఆభరణాలతో నామినేషన్