Chandrayaan 3 Orbit Path : జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దిశగా పయనిస్తోంది. సకాలంలో పేలోడ్‌ను మండించి రెండోసారి కక్ష్య మార్పిడి ప్రక్రియను సోమవారం ఇస్రో చేపట్టింది. చంద్రయాన్-3 ప్రస్తుతం 41,603 కి.మీ. x 226 కి.మీ. కక్ష్యలో ఉంది. తదుపరి కక్ష్య మార్పిడి ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఉంటుందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 గమనం సజావుగా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశముందని వెల్లడించారు.
-
#Chandrayaan3 | "The second orbit-raising manoeuvre (Earth-bound apogee firing) is performed successfully. The spacecraft is now in 41603 km x 226 km orbit. The next firing is planned for tomorrow between 2 and 3 pm IST," says ISRO
— ANI (@ANI) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Photo - launch of the Chandrayaan-3 Mission… pic.twitter.com/N4h5SxC76V
">#Chandrayaan3 | "The second orbit-raising manoeuvre (Earth-bound apogee firing) is performed successfully. The spacecraft is now in 41603 km x 226 km orbit. The next firing is planned for tomorrow between 2 and 3 pm IST," says ISRO
— ANI (@ANI) July 17, 2023
(Photo - launch of the Chandrayaan-3 Mission… pic.twitter.com/N4h5SxC76V#Chandrayaan3 | "The second orbit-raising manoeuvre (Earth-bound apogee firing) is performed successfully. The spacecraft is now in 41603 km x 226 km orbit. The next firing is planned for tomorrow between 2 and 3 pm IST," says ISRO
— ANI (@ANI) July 17, 2023
(Photo - launch of the Chandrayaan-3 Mission… pic.twitter.com/N4h5SxC76V
Chandrayaan 3 Launch Date : జులై 14న 2 గంటల 34 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ను ప్రయోగించారు. దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్, రోవర్‌ను దించే లక్ష్యంతో అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌లో దీనిని ప్రయోగించింది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్.. రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయింది. దీన్ని భూమి చుట్టూ ఉన్న 170X 36 వేల 500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెట్టింది ఇస్రో. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ 24 రోజుల పాటు తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్స్‌గా పిలుస్తారు. ఆ తర్వాత చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్-3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక.. లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు.
Chandrayaan 3 Launch Vehicle : మొత్తంగా చంద్రయాన్-3 సుమారు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఆగస్టు 23న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటుంది. జాబిల్లిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు యాక్సెలెరోమీటర్, ఇంక్లినోమీటర్, ఆల్టీమీటర్, టచ్‌డౌన్ సెన్సర్, అవరోధాలు తప్పించుకోవడానికి కెమెరాలు తదితర సెన్సర్లు ఉంటాయి. ఇవి చంద్రయాన్-2లో పొందుపరిచిన వాటికంటే మెరుగైనవి.
ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుంది. చంద్రునిపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్ అయిన తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్-3లో ఆర్బిటర్‌ను పంపడంలేదు. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకు వెల్లడించింది.
Chandrayaan 3 Budget : మొత్తంగా చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం 613 కోట్ల రూపాయలను ఇస్రో ఖర్చు చేసింది. చంద్రయాన్-3 బరువు 3,900 కిలోలు, అందులో ల్యాండర్, రోవర్ బరువు 1752 కిలోలు.
ఇవీ చదవండి : నింగిలోకి చంద్రయాన్-3.. ప్రయోగం సక్సెస్.. వీడియో చూశారా?
CHANDRAYAAN 3: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3.. అభినందనల వెల్లువ