ETV Bharat / bharat

Isro Chandrayaan 3 : జాబిల్లి ఫొటోలను తీసిన విక్రమ్​ ల్యాండర్‌.. షేర్ చేసిన ఇస్రో.. - చంద్రయాన్ 3 అప్‌డేట్ ఫోటోలు

Isro Chandrayaan 3 Lander Module : చంద్రుడి దక్షిణ ధ్రువంపై అధ్యయనం కోసం చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన జాబిల్లి ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 15, 17 తేదీల్లో ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా విడుదల చేసిన చంద్రుని చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. మరోవైపు ల్యాండర్‌ మాడ్యూల్‌ డీబూస్టింగ్‌ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా చేపట్టిన ఇస్రో.. 113 కిలోమీటర్లుX 157 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ నెల 20న మరోసారి డీబూస్టింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. 23వ తేదీ సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ అడుగుపెట్టనుంది.

isro-chandrayaan-3-lander-module-health-normal-and-gets-closer-to-moon-isro-chandrayaan-3-photos
చంద్రయాన్​ 3 ఫొటోస్​
author img

By

Published : Aug 18, 2023, 5:42 PM IST

Updated : Aug 18, 2023, 6:16 PM IST

Isro Chandrayaan 3 Lander Module : చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా.. LPDC తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 15, 17వ తేదీల్లో ఈ చంద్రుని చిత్రాలను LPDC తీసింది. గురువారం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయిన తర్వాత తీసిన చంద్రుని చిత్రాలను ఇస్రో..సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ల్యాండర్‌ మాడ్యూల్‌లో ఉన్న కెమెరాతో తీసిన ఈ చిత్రాల్లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో పాటు చంద్రునిపై వివిధ ప్రదేశాలను చూడవచ్చు.

మరోవైపు చంద్రయాన్‌-3 మిషన్‌లో మరో కీలక ఘట్టాన్ని ఇస్రో శుక్రవారం పూర్తి చేసింది. గురువారం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌ డీబూస్టింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ల్యాండర్‌ మాడ్యూల్‌ 113 కిలోమీటర్లు X 157 కిలోమీటర్ల కక్ష్యలో చంద్రుని చుట్టూ తిరుగుతోంది. ఆగస్టు 20వ తేదీన మరోసారి డీబూస్టింగ్‌ ప్రక్రియ చేపట్టి మరోసారి కక్ష్యను తగ్గించనున్నారు. చివరగా ల్యాండర్‌ వేగం తగ్గించి చంద్రునికి దగ్గరగా 30 కిలోమీటర్లు, దూరంగా 100 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ను.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రక్రియ చేపట్టనున్నారు. చంద్రునిపై ల్యాండర్‌ దిగేటప్పుడు ఆరంభంలో వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లు ఉండనుంది. వేగం తగ్గించుకుంటూ.. ఈనెల 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు ల్యాండర్​ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. అనంతరం ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.

చంద్రయాన్‌-2 విషయంలో సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో ఇస్రో విఫలమైంది. ఈసారి సెన్సార్లు, ఇంజిన్లు విఫలమైనా జాబిల్లిపై ల్యాండర్‌ మృదువుగా దిగేలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ మాత్రం ప్రస్తుత కక్ష్యలోనే కొన్నేళ్లపాటు తన ప్రయాణం కొనసాగించనుంది. అక్కడి నుంచి భూమి వాతావరణం, మేఘాల కదలికలపై అధ్యయనం చేయనుంది.

isro-chandrayaan-3-lander-module-health-normal-and-gets-closer-to-moon-isro-chandrayaan-3-photos
జాబిల్లి ఫొటోలను తీసిన విక్రమ్​ ల్యాండర్‌

Isro Chandrayaan 3 Photos : చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా ఆగస్టు 15న ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా.. LPDC, ఆగస్టు 17న ల్యాండర్ ఇమేజర్ కెమెరా-1 తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోక ముందు విడిపోయిన తర్వాత తీసిన చిత్రాలు ఇందులో ఉన్నాయి. గురువారం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయిన తర్వాత ల్యాండర్ ఇమేజర్ కెమెరా-1 తీసిన చిత్రాల్లో చంద్రునిపై వివిధ ప్రదేశాలతో పాటు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను కూడా మనం చూడవచ్చు.

సజావుగా ల్యాండర్‌ మాడ్యుల్​ ప్రయాణం..
Lander Vikram Chandrayaan-3 : ఈనెల 20న ల్యాండర్‌-విక్రం, రోవర్‌ ప్రజ్ఞాన్‌తో కూడిన ల్యాండర్‌ మ్యాడుల్‌ను చంద్రుని ఉపరితలానికి అత్యంత సమీప కక్ష్యలోకి చేర్చేందుకు రెండో డీబూస్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈనెల 20న రెండో డీబూస్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టనున్నట్లు ఇస్రో పేర్కొంది. అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టే సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు.. ఈనెల 23న ఇస్రో ఏర్పాట్లు చేసింది. జులై 14న చంద్రయాన్‌-3 మిషన్‌ ప్రయోగం చేపట్టగా.. 35 రోజుల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యుల్‌ విజయవంతంగా వేరుపడింది.

చంద్రయాన్​ 3

ISRO Chandrayaan 3 : లక్ష్యం దిశగా చంద్రయాన్​-3.. చివరి కక్ష్య తగ్గింపు సక్సెస్​

Chandrayaan 3 : 'థ్యాంక్స్​ ఫర్​ ది రైడ్​'.. చంద్రయాన్‌-3 నుంచి విడిపోయిన 'విక్రమ్‌'

Last Updated : Aug 18, 2023, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.