ISRO Apprentice Jobs 2023 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 435 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు.. కేరళ, తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు - 273
- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు - 162
డిపార్ట్మెంట్స్
ఎయిరోనాటికల్/ ఎయిరోస్పేస్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, ప్రొడక్షన్, ఫైర్ అండ్ సేఫ్టీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్, టెక్నాలజీ డిపార్ట్మెంట్స్.
విద్యార్హతలు
ISRO Apprentice Eligibility :
- అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బీటెక్/ బీఈ/ బీఎస్సీ/ బీకాం/ బీఏ/ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు మాత్రం.. సంబంధిత విభాగాన్ని అనుసరించి ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
ISRO Apprentice Age Limit :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు లోపు ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు లోపు ఉండాలి.
ట్రైనింగ్ - స్టైపెండ్
ISRO Apprentice Salary :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలలపాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో వారికి నెలకు రూ.9000 చొప్పున అందిస్తారు.
- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000 చొప్పున స్టైపెండ్ అందించడం జరుగుతుంది.
ఎంపిక విధానం
ISRO Apprentice Selection Process :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎవరికైతే మెరిట్ మార్కులు వస్తాయో.. వారినే అప్రెంటీస్ పోస్టుల కోసం ఎంపిక చేస్తారు.
- టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి పరీక్ష, ఇంటర్వ్యూ రెండూ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్, కలమస్సేరి, ఎర్నాకుళం జిల్లా, కేరళ
దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఇంటర్వ్యూ జరిగే తేదీ : 2023 అక్టోబర్ 7
- ఇంటర్వ్యూ జరిగే సమయం : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
NCL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. NCLలో 1140 అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!