ETV Bharat / bharat

టీఎంసీ గురి భాజపాపై... దెబ్బలు మాత్రం కాంగ్రెస్​కు.. ఎందుకిలా? - టీఎంసీ న్యూస్​

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలను, ప్రత్యేకించి టీఎంసీ నాయకులను తమ పార్టీలోకి భారీగా ఆహ్వానించింది భాజపా. కానీ అనుకున్న ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్​ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రల్లో కాంగ్రెస్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే చాలామందిని పార్టీలో చేర్చుకుంది. భాజపాపై కాకుండా తమ పార్టీపై తృణమూల్ కాంగ్రెస్​ ఎందుకు దృష్టి సారించిందని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో ఎన్డీఏను గద్దె దించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమని చెప్పిన దీదీ.. 'మిత్రపక్షం' కాంగ్రెస్​ను బలహీనపరచాలనుకోవడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Is Trinamool's strategy to rope in Cong leaders ideal for the spirit of alliance politics
టీఎంసీ గురి భాజపాపై... దెబ్బలు మాత్రం కాంగ్రెస్​కు.. ఎందుకిలా?
author img

By

Published : Oct 27, 2021, 6:39 PM IST

అసోం, త్రిపుర, గోవా సహా ఉత్తర్​ప్రదేశ్​లో సంస్థాగతంగా బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ను బలహీనపరిచి తమ పునాదులు నిర్మించుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. అందుకే హస్తం పార్టీ నేతలను ఒక్కొక్కరిగా తమ పార్టీలోకి చేర్చుకుంటోంది.

అయితే 2024 ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు బలమైన ప్రతిపక్ష కూటమి అవసరమని, అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడు ఆమే కాంగ్రెస్​ను బలహీన పరిచే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో కూటమి ధర్మంలో ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు? అనే ప్రశ్నలు సాధారణంగానే ఉత్పన్నమవుతున్నాయి.

అప్పుడు భాజపా... ఇప్పుడు టీఎంసీ...

సంస్థాగతంగా బలంగా లేకుండా కేవలం ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించి ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమని ఈ ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఈ ఎన్నికలకు ముందు భాజపా.. ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకుంది. ప్రత్యేకించి టీఎంసీ నాయకులను పార్టీలోకి పెద్దఎత్తున ఆహ్వానించింది. వారికే టికెట్లు కూడా ఇచ్చింది. అయితే ఈ వ్యూహంతో సానుకూల ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడు పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్​ కూడా సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులకు గాలం వేస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్​లో పెద్ద పెద్ద నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ​

రాజకీయ నాయకులు పార్టీలు మారడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయిందని కలకత్తా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్​ రాజగోపాల్ ధార్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. అయితే ఈ సంస్కృతికి మూలాలు మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. అక్కడ పార్టీలు ఫిరాయించిన ప్రజాప్రతినిధుల వల్ల ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

" ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునే విషయంలో తృణమూల్​ కాంగ్రెస్ భాజపాపై కాకుండా కాంగ్రెస్​పై ఎందుకు దృష్టి సారించిందని అధీర్ రంజన్ చౌధరి ప్రశ్నించారు? ఆయనతో నేను ఏకీభవిస్తాను. కాంగ్రెస్​ బలహీన పరుస్తూ బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఈ చర్యలతో కూటమి రాజకీయ స్ఫూర్తిపై ప్రశ్నలు తలెత్తుతాయి"

-రాజగోపాల్ ధార్ చక్రవర్తి

కాంగ్రెస్​కు సొంత బలహీనత

కాంగ్రెస్​ పార్టీకి సొంత బలహీనత ఉందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ప్రెసిడెన్సీ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్​ డా.అమల్ కుమార్​ ముఖోపాధ్యాయ్​ అభిప్రాయపడ్డారు. అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీకి అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు.

" బంగాల్​లో​ 15 పార్టీలతో కూడిన వామపక్ష కూటమిని చూశాం. రాష్ట్రంలో 34 ఏళ్ల పాటు ఈ కూటమే అధికారంలో ఉంది. సీపీఎం కీలక పాత్ర పోషించింది. కానీ ఆ పార్టీ ఎప్పుడూ ఇతర పార్టీలను బలహీనపరిచేందుకు గానీ, వేరే పార్టీల నాయకులను చేర్చుకునేందుకు గానీ ప్రయత్నించలేదు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహంతో ఆ పార్టీకి ఎన్నికల్లో ఏమేర ప్రయోజనం కలుగుతుందో కాలమే సమాధానం చెబుతుంది. కానీ ఈ సంస్కృతి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు."

- డా.అమల్ కుమార్​ ముఖోపాధ్యాయ్

అనైతికం కానే కాదు..

తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ మాత్రం తమ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం అనైతికం కాదని చెబుతున్నారు.

" కాంగ్రెస్​ బలంగా ఉన్న ప్రాంతాల్లో మేం ఆ పార్టీతో సఖ్యతగానే ఉన్నాం. కానీ కాంగ్రెస్ అంతర్గత బలహీనతల కారణంగా చాలా చోట్ల భాజపా బలపడుతోంది. అలాంటి ప్రాంతాల్లో భాజపాకు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. గత కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్​ తన జాతీయ ఔచిత్యాన్ని కోల్పోయిందనే మాట వాస్తవం. కాంగ్రెస్ వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకునే నేను ఈ మాట చెబుతున్నా. ప్రస్తుతం భాజపాకు వ్యతిరేక ముఖచిత్రంగా మమతా బెనర్జీ ఉండటమే అత్యంత ఆమోదయోగ్యం. తృణమూల్​ కాంగ్రెస్​పై అనవసరంగా నిందలు మోపే ముందు కాంగ్రెస్ సొంత బలహీనతలను అధిగమించాలి. "

- సౌగతా రాయ్​

కాంగ్రెస్ మహాసముద్రం..

అయితే ఈ పరిణామాలపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు. కాంగ్రెస్ ఒక మహాసముద్రమని, కొంతమంది కొన్ని బకెట్ల నీళ్లు తోడుకున్నంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యూహాలతో తమ పార్టీని ఎవరూ బలహీనపరచలేరని పేర్కొన్నారు. అయితే అంతర్గత బలహీనతలను సరిదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా ఉందని స్పష్టం చేశారు. అదే సయమంలో ఒక పార్టీని మరో పార్టీ విశ్వసించడం కూటమి స్ఫూర్తి అని, ప్రతి పార్టీ దాన్ని గౌరవించాలన్నారు.

ఇదీ చదవండి: 'తప్పుడు ప్రచారంతో దేశ ప్రజల్ని రక్షించలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.