ETV Bharat / bharat

కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే! - సోలార్​ కుంభకోణం

అవినీతి, పెద్ద ఎత్తున అక్రమ తాత్కాలిక నియామకాలు.. ఇవీ కేరళలోని పినరయి విజయన్​ సర్కార్​పై ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు. బ్యాక్​ డోర్​ నియామకాల పేరిట.. ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఇటీవల పీఎస్​సీ ర్యాంకర్లు చేసిన నిరసనలూ హింసాత్మకంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అజెండాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ భావిస్తోంది. తమ యువజన విభాగాలతో పెద్ద ఎత్తున నిరసనలు చేయిస్తోంది. అయితే.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​ వీటిని ఎలా తిప్పికొడుతుంది? ప్రజల మెప్పును పొంది వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తుందా? కేరళ పోరులో ఏం జరగనుంది?

Is a 'backdoor' exit awaiting LDF in Kerala?
'బ్యాక్​ డోర్​' నిష్క్రమణా? రెండోసారి పీఠమా?
author img

By

Published : Feb 11, 2021, 5:32 PM IST

Updated : Feb 12, 2021, 2:37 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​(ఎల్​డీఎఫ్​). అయితే.. అధికార పక్షంపై వచ్చిన అవినీతి, బ్యాక్​ డోర్​ నియామకాల ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు తాజాగా.. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(పీఎస్​సీ) ర్యాంకర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పీఎస్​సీ ర్యాంక్​ లిస్ట్​ చెల్లుబాటును పొడిగించాలని, తమను కాదని.. తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటోందని ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అనంతర పరిణామాల నడుమ కొవిడ్​ సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం మరో 6 నెలలు గడువు పొడిగించినా అభ్యర్థులు నిరసనలు విరమించలేదు.

Is a 'backdoor' exit awaiting LDF in Kerala?
పినరయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ధర్నా

వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పినరయి విజయన్​.. ప్రభుత్వంలో ఎంతో కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను మానవతా ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తున్నామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుత పీఎస్​సీ ర్యాంకర్ల అవకాశాలపై ఏ మాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అయినా.. తాత్కాలిక నియామకాలపై ఆందోళన చెందుతున్నారు నిరసనకారులు.

కన్నూర్​ కలెక్టరేట్​ ముందు పడుకొని నిరసన

అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సమస్యను ఉపయోగించుకోవాలని భావించిన ఇతర రాజకీయ పార్టీలే నిరసనలను వెనకుండి నడిపిస్తున్నాయని జోరుగా చర్చ సాగుతోంది.

ఇదే అజెండాగా విపక్షాలు ఎన్నికలకు వెళ్లనున్నాయని తెలుస్తోంది. 'బ్యాక్​ డోర్​ నియామకాల' అంశాన్ని ఎత్తిచూపి.. యూడీఎఫ్​ తన యువజన విభాగాలు యూత్​ కాంగ్రెస్​, కేఎస్​యూ, యూత్​ లీగ్​, ఎంఎస్​ఎఫ్​ ద్వారా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఎల్‌డీఎఫ్‌పై అవినీతి, బంగారం స్మగ్లింగ్‌ వంటి ఆరోపణలు ఉన్న తరుణంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాలని ఊవిళ్లూరుతోంది.

ఈ నేపథ్యంలో.. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలంటే పినరయి ప్రభుత్వం చెమటోడ్చాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

PINARAYI VIJAYAN
పినరయి విజయన్​

ఎలా మొదలైంది..?

సెంటర్​ ఫర్​ డెవలప్​మెంట్​ ఆఫ్​ ఇమేజింగ్​ టెక్నాలజీకి చెందిన 114 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతోనే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో దీనిని ఇటీవలి బంగారం స్మగ్లింగ్​ కేసుతో ముడిపెడుతున్నాయి విపక్షాలు. ఆ కేసులో ప్రధాన నిందితురాలు, ఐటీ శాఖలో పనిచేసిన స్వప్నా సురేష్​ను పినరయి సర్కార్​ నియమించలేదని చెప్పినా.. ఆమెకు అదే శాఖ మాజీ కార్యదర్శి ఎం శివ్​శంకర్​తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన అనంతరం ప్రభుత్వానికి షాక్​ తగిలింది. ఇలాంటి తాత్కాలిక నియామకాలతో ప్రభుత్వ విభాగాల్లో అవకతవకలకు అవకాశముందని తేటతెల్లమైంది.

SWAPNA SURESH
స్వప్నా సురేష్​

ఇదీ చూడండి: బంగారం స్మగ్లింగ్ కేసులో 20మందిపై ఛార్జ్​షీట్​

దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. సోలార్​ కుంభకోణం నిందితురాలు సరితా నాయర్​కు సంబంధించిన ఆడియో క్లిప్పులు బహిర్గతమయ్యాయి. అందులో తాత్కాలిక నియామకాలు ఎలా జరుగుతాయి.. ఎవరెవరికి ఎంత ముడుపులు అందుతాయన్నది మాట్లాడుకున్నట్లు ఉంది. ఈ సంభాషణ పీఎస్​సీ ర్యాంకర్లలో మరింత భయాలను పెంచింది.

మరోవైపు.. ఈ 2013 సోలార్​ స్కాం 2016 ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ యూడీఎఫ్​కు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. ఈ కేసులో అప్పటి కేరళ సీఎం ఉమెన్ చాందీ సహా మరో ఐదుగురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

CHANDY
ఉమెన్​ చాందీ

ఇదీ చూడండి: సీబీఐ చేతికి కేరళ 'సోలార్ స్కామ్' కేసు!

పకడ్బందీ వ్యూహం..

అయితే.. ఈ అవినీతి, అక్రమ తాత్కాలిక నియామకాలు, బ్యాక్​ డోర్​ నియామకాల ఆరోపణలు, విపక్షాల విమర్శలను ఎదుర్కొని, ఎల్​డీఎఫ్​ గట్టెక్కాలంటే కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సిందే. వీటన్నింటినీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, అవినీతి రహిత ప్రభుత్వం నినాదాలతో తిప్పికొట్టాలని భావిస్తోంది విజయన్​ ప్రభుత్వం.

ఇంకా.. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​లో నాయకత్వ సంక్షోభం అధికార పార్టీకి బలాన్ని చేకూర్చేదే. ఆ కూటమి ఎన్నికల కోసం సన్నద్ధమయ్యే తీరును చూసి ఎల్​డీఎఫ్ కాస్త సంతోషిస్తోంది. యూడీఎఫ్​ సంప్రదాయ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోవచ్చని ఆశాజనకంగా ఉంది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇది పక్కాగా అమలుచేసి విజయవంతం అయింది. ఎల్‌డీఎఫ్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు లభించిన ప్రజామోదంగా విశ్లేషకులు ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్నారు. మరో 3 మాసాల్లో కేరళ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని.. స్థానిక పోరు ఫలితాలు చూచాయగానైనా వెల్లడించాయని చెబుతున్నారు.

ఇదీ చూడండి: అభివృద్ధికే కేరళ ప్రజల ఓటు.. 'స్థానికం'లో ఎల్​డీఎఫ్​దే జోరు

యువత చేతుల్లో..?

స్థానిక ఎన్నికల్లో నెగ్గినా.. ఇప్పుడు పరిస్థితి వేరు. పెద్ద ఎత్తున యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడాన్ని అధికార కూటమి జీర్ణించుకోలేకపోతోంది. ఎన్నికలకు ముందు వారికి ఇది పెద్ద సవాల్​ విసురుతోంది. అయితే గత యూడీఎఫ్​ పాలనలోనూ ఇలాంటి బ్యాక్​ డోర్​ నియామకాలు జరిగాయని అధికార పక్షం చెబుతున్నప్పటికీ.. ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.

ఏదేమైనా కేరళ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఈ బ్యాక్​ డోర్​ నియామకాల అంశం చుట్టూనే తిరగనుందని ఇప్పటికే తెలిసింది. అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం, వాస్తవాలు- ఆరోపణల నడుమ ఎన్నికల సమరం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే.. చివరకు ఎవరు ప్రజల విశ్వాసం చూరగొంటారో వేచిచూడాలి. ప్రజల మొగ్గు ఏ పార్టీ వైపు ఉందో, వారి ఆలోచనా ధోరణి ఎలా సాగుతుందోనన్న స్పష్టత రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

(కె. ప్రవీణ్​ కుమార్​, ఈటీవీ భారత్​-కేరళ)​

Last Updated : Feb 12, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.