IOCL Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించింది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్). రిఫైనరీస్ డివిజన్లో ఖాళీగా ఉన్న మొత్తం 1720 అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిఫైనరీల్లో పోస్టులు..
IOCL Recruitment 2023 Notification :
- గువాహటి రిఫైనరీ
- బరౌని రిఫైనరీ
- గుజరాత్ రిఫైనరీ
- హల్దియా రిఫైనరీ
- మధుర రిఫైనరీ
- దిగ్బోయి రిఫైనరీ
- బొంగైగావ్ రిఫైనరీ
- పారాదీప్ రిఫైనరీ
- పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీ
ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు(IOCL Jobs Trades)
- అటెండెంట్ ఆపరేటర్
- ఫిట్టర్
- మెకానికల్
- సెక్రటేరియల్ అసిస్టెంట్
- అకౌంటెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు - 869 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటీస్ విభాగాలు(IOCL Jobs Trades 2023)..
- కెమికల్
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- ఇన్‌స్ట్రుమెంటేషన్
టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాలు - 851 పోస్టులు
విద్యార్హతలు..
IOCL Jobs Eligibility : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్, సంబంధిత ట్రేడ్ లేదా విభాగంలో ఐటీఐ, డిప్లొమా; డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి..
IOCL Jobs Age Limit : 2023 అక్టోబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
IOCL Jobs Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం తేదీ : 2023 అక్టోబర్ 21
- దరఖాస్తుకు చివరి తేదీ : 2023 నవంబర్ 20
- అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ : 2023 నవంబర్ 27 నుంచి 2023 డిసెంబర్ 2 వరకు
- పరీక్ష తేదీ : 2023 డిసెంబర్ 3
- ఫలితాల వెల్లడి : 2023 డిసెంబర్ 8
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ : 2023 డిసెంబర్ 13 నుంచి 2023 డిసెంబర్ 21 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్..
IOCL Official Website : నోటిఫికేషన్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ https://www.ioclapply.com/ను చూడవచ్చు.
UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. UCILలో 243 అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!