ETV Bharat / bharat

భారత్​పై 'సైబర్​ వార్'.. 2,000 వెబ్​సైట్లు హ్యాక్.. నుపుర్ వ్యాఖ్యలే కారణమట!

author img

By

Published : Jul 8, 2022, 7:20 PM IST

భారత్​పై సైబర్​ దాడికి సంబంధించి గురజార్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మలేషియా, ఇండోనేషియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు.. దేశంలోని 2,000కు పైగా వెబ్​సైట్లను హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడులు చేస్తున్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

cyber war
సైబర్ వార్

భారత్​పై 'సైబర్​ వార్' జరిగింది. మలేషియా, ఇండోనేషియాకు చెందిన హ్యాకర్ గ్రూపులు 2,000కు పైగా వెబ్​సైట్​లను హ్యాక్ చేశాయి. 'డ్రాగన్ ఫోర్స్ మలేషియా', 'హాక్టివిస్ట్ ఇండోనేషియా' గ్రూపులు ఈ సైబర్ దాడులకు పాల్పడినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైం డీసీపీ అమిత్ వాసవ తెలిపారు. వీరిని పట్టుకునేందుకు సైబర్​ క్రైం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డ్రాగన్ ఫోర్స్​ మలేషియా, హాక్టివిస్ట్ ఇండోనేషియా అనే రెండు హ్యాకర్ గ్రూపుల సభ్యులపై లుకౌట్ ​నోటీసులు ఇవ్వడం కోసం ఇంటర్​పోల్​కు లేఖ రాశారు అమిత్ వాసవ. అలాగే ఇరు దేశాల ప్రభుత్వాలకు సైతం లేఖ రాశారు.

భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ భారత వెబ్సైట్లపై మలేషియా హ్యాకర్లు సైబర్ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. మలేషియా కేంద్రంగా పనిచేసే ఈ హ్యాకర్ల గ్రూప్ గతంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్​ వెబ్సైట్​లపైనా సైబర్ దాడులు చేసినట్లు సమాచారం. ఇది మలేషియా, పాక్ ప్రభుత్వాలతోనూ కలిసి పని చేసిన దాఖలాలు ఉన్నాయి.

ఇవీ చదవండి: ప్రియుడ్ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. అతడు చేసిన పనితో గెస్ట్​లంతా షాక్

సీఎం భార్య ట్విట్టర్​ ఖాతా బ్లాక్​​.. పెళ్లైన మరుసటి రోజే.. కారణమిదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.