ఈ నెల 25న కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది అక్కడి యంత్రాంగం. అంతేగాకుండా.. పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటోంది. అయితే.. ఇంటర్నెట్ నిలిపివేత, ద్విచక్ర వాహనాల స్వాధీనానికి షా పర్యటనతో సంబంధం లేదని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. సాధారణ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగమేనని స్పష్టం చేశారు.
"బైక్‌లను స్వాధీనం చేసుకోవడం, కొన్ని టవర్‌ల పరిధిలో ఇంటర్నెట్ మూసివేయడం ఉగ్రవాద హింసకు సంబంధించినదే. దీనికి అమిత్ షా పర్యటనకు ఎలాంటి సంబంధం లేదు"
-విజయ్ కుమార్, కశ్మీర్ జోన్ ఐజీపీ
గత వారం కశ్మీరేతర కార్మికులపై ఉగ్రదాడుల అనంతరం డజన్ల కొద్దీ టవర్లలో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు అధికారులు. అయితే ద్విచక్ర వాహనాల కఠిన తనిఖీలపై విమర్శలొస్తున్నాయి. 'సంబంధిత పత్రాలను చూడకుండానే తమ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. అక్టోబర్ 26 తర్వాత తమ వాహనాలను తిరిగి తీసుకునేందుకు రావాలని చెప్పినట్లు' ద్విచక్ర వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: