ETV Bharat / bharat

International Friendship Day 2023 : ఇలాంటి ఫ్రెండ్​ ప్రతి ఒక్కరికీ ఉండాలి.. మరి మీకు ఉన్నాడా..? - స్నేహితుల దినోత్సవం

International Friendship Day 2023 : జీవితంలో ప్రతి ఒక్కరితి స్పెషల్​ ఫ్రెండ్ ఉంటారు. అదే అండి మనం తిట్టించుకునే తిట్లలో సగం తినేవాడు, ఒకవేళ వాడు తింటే మనకు తినిపించే వాడు. అలాంటి ఫ్రెండ్స్​కి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారంలో జరుపుకునే స్నేహితుల దినోత్సవం వచ్చేసింది. మరీ ఈ సారి వాళ్లకి ఏం గిఫ్ట్​ ఇస్తున్నారు.. ఇంకేమిస్తాం తిట్లే అని మాత్రం అనకండి.

Friendship Day
Friendship Day Special Story
author img

By

Published : Aug 6, 2023, 2:32 PM IST

Friendship Day 2023 : 'ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడితో తిరగొద్దని చెప్తే వినవా' అన్న మాట ప్రతి స్నేహితుడు తమ తల్లిదండ్రుల నోట వినే ఉంటారు. మనం ఏం చేస్తాం సరేలే అంటూ మన పని కానిచేస్తాం. ఒక్కోసారి నాన్నకు తెలికుండా మరీ వాడిని కలుస్తాం. పాపం మనం తినే తిట్లలో కూడా వాడికి వాటా పెడతాం. అలా ఉంటది మరీ దోస్తానా అంటే..! ఫ్రెండ్​ అంటే కేవలం మంచి, చెడులే కాదు అన్ని పంచుకోవాలి, పంచాలి కూడా అంతే కదా. అలాంటి ఫ్రెండ్స్​కి ఈ స్నేహితుల రోజున ఏం ఇస్తున్నారు మరీ..?

అన్ని మాటలు పడినా మన వెంటే: స్కూల్​ వెళుతున్నప్పటి నుంచి కాలేజీ వరకు మనకు ఫ్రెండ్స్ ఉంటారు అది కామన్. కానీ ఒక్కరుంటారు తినే కంచం నుంచి పడుకునే మంచం వరకు తోడుండే వాడు, సమస్య ఏదీ కానీ నేనున్నాని భుజం తట్టేవాడు, వాడికి సమస్య వస్తే మనల్ని కూడా ఇబ్బందుల్లో నెట్టేసే వాడు, కానీ పొరపాటున ఇంటి దరిదాపుల్లో మనవాళ్లకి వాడితో కనిపించాం అనుకోండి ఇంకా భజన మొదలు పెడతారు. నీ వల్లే వాడు ఇలా తయారవుతున్నాడు. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. అని వాయించేస్తుంటారు. అన్ని మాటలు అన్నా కూడా వాడు మనతో ఫ్రెండ్​షిప్​ చేస్తాడు చూడు అదే వాడి దగ్గర ఉండే స్పైషాలిటీ.. అలాంటి ఫ్రెండ్స్​ని ఎందుకు వదులుకుంటాం చెప్పిండి.

వారికిచ్చే గొప్ప బహుమతి: కానీ ఇప్పడి జనరేషన్​ పిల్లలు మాత్రం చిన్నపాటి మనస్పర్థలకే వాడు నా ఫ్రెండ్​ కాదురా అది ఇది అంటూ అన్ని సంవత్సరాల స్నేహాన్ని మరచిపోతున్నారు. అలా మాట్లాడే ముందు, వాడిని వదిలే ముందు ఇన్నేళ్ల బంధాన్ని మరచిపోతారు. మీరు కూడా ఇలాంటి చిన్నపాటి మిస్టేక్స్​కి మీ ఫ్రెండ్స్​తో విడిపోయి ఉంటే వెళ్లి మాట్లాడండి ఇదే మీరు వారికి ఇచ్చే గొప్ప బహుమతి.

స్నేహం పట్ల నిజాయతీగా ఉండండి: ముఖ్యంగా ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహం చేస్తే ఇప్పటికాలంలో కూడా తప్పుగా అనుకునే వారు చాలామంది. సింపుల్​గా ఈ అమ్మాయికి వేరే అమ్మాయి దొరకలేద ఫ్రెండ్​షిప్​ చేయడానికి అని అనేస్తారు. కానీ అబ్బాయితో స్నేహం చేసే అమ్మాయే వాళ్ల ఫ్రెండ్​షిప్​లో ఆనందంగా ఉంటుందట..! అమ్మాయిల మధ్య వచ్చే అన్ని మనస్పర్థలు అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్​కి రావని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి మీకు మేల్ బెస్టీ ఉంటే అందరు అన్న మాటలు పట్టించుకోకండి మీరు మీ స్నేహం పట్ల నిజాయితిగా ఉండండి. కానీ ఆ ఫ్రెండ్​షిప్​ వల్ల తల్లిదండ్రులకు ఎలాంటి అవమానాలు రాకుండా చూసుకోండి.

మనం ఏ తప్పు చేసినా.. ఒకరి వల్ల ఎంత బాధ పడుతున్న, అసలు ఒక దాని వల్ల మనం ఎఫెక్ట్​ అవుతున్నాం అని ఎవ్వరితో చెప్పుకోలేని విషయాలు కేవలం ఒక ఫ్రెండ్​తోనే పంచుకుంటాం. అది మంచి కానీ చెడు కానీ అలాంటి ఫ్రండ్స్​ని చిన్నపాటి విషయాలకు దూరం చేసుకోకండి. వారితో మనం ఉన్నప్పుడు ఎలా చూశాడో గుర్తుంచుకోండి చాలు మీ స్నేహానికి ఎప్పుడు అంతం అనేదే ఉండదు.

Squirrel Dosthi : ఉడత..ఈ వ్యక్తి.. విడదీయరాని దోస్తీ..

Friendship Day Special: ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారునా..!

Friendship Day 2023: స్నేహం... అక్షరాలకందని అనుభూతుల ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.