Infiltration Bid: పాకిస్థాన్ మరో దురాఘతానికి పాల్పడింది. ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి జమ్ముకశ్మీర్ కుప్వారాలోకి అక్రమంగా ప్రవేశించాలని చూడగా.. సైన్యం మట్టుబెట్టింది. ఏకే-47 సహా భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని అతని నుంచి స్వాధీనం చేసుకుంది.
రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉందని సైనిక అధికారులు తెలిపారు. ఇది పాకిస్థాన్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్ చొరబాటుగా పేర్కొన్నారు. జనవరి 1న కేరన్ సెక్టార్లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించగా.. వెంటనే స్పందించిన భారత సైన్యం ఆ ఉగ్రవాదిని హతమార్చినట్లు వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతడి కదలికలను గమనించినట్లు స్పష్టం చేశారు.
చనిపోయిన ముష్కరుడిని పాక్‌కు చెందిన మహ్మద్ షబ్బీర్ మాలిక్‌గా గుర్తించారు. అతడి వద్ద పాకిస్థాన్ జారీ చేసినట్లుగా ఉన్న గుర్తింపు కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని బట్టి సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు స్పష్టం అయిందని అధికారులు అన్నారు.
ఇవీ చూడండి: మహిళల వేలం పేరుతో వికృత చేష్టలు.. ఆ యాప్ బ్యాన్!