జమ్ముకశ్మీర్ మాచిల్ సెక్టర్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు, ఓ బీఎస్ఎఫ్ జవాను వీర మరణం పొందారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించింది సైన్యం. అనంతరం రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు అప్రమత్తమై ప్రతిఘంటించారు. ఈ పరిణామాలు ఎదురుకాల్పులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారి వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్‌తో పాటు రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే మరణించిన ఉగ్రవాదుల వివరాలు, చొరబాటు సంబంధిచిన అంశాలు తెలియాల్సి ఉంది.