ఛత్తీస్‌గఢ్ ధమతరీలో ఓ విషాద ఘటన జరిగింది. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ఓ శిశువు.. ఆ తల్లి పక్కనే విగతజీవిగా కనిపించింది. తాగిన మత్తులో తల్లి ఉండగా.. ఆకలి బాధతో ఆ పసికందు మృతిచెందిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ జరిగింది..
సుందర్గంజ్లో నివాసం ఉంటున్న రాజ్వీర్ కౌర్.. తాగిన మత్తులో రోడ్డుపై పడిపోయి ఉందని స్థానికులు.. పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లి పక్కనే విగతజీవిగా పడి ఉన్న శిశువును గుర్తించారు. ఆకలితో శిశువు మరణించి ఉంటుందని పోలీసులు అధికారి ఒకరు స్పష్టం చేశారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి కౌర్‌పై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. స్థానికులు మాత్రం ఆమె మద్యానికి బానిసై శిశువును పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి:నందిగ్రామ్‌లో మమత భారీ రోడ్ షో