ఆధార్‌లో ఫోన్ నెంబర్ మార్పు చేసుకోవడం మరింత సులభతరం కానుంది. పోస్ట్‌మెన్ సహకారంతో ఇంటి వద్దే మార్పు చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, భారత ఏకీకృత గుర్తింపు సంఖ్య ప్రాథికార సంస్ధ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
650 పోస్ట్ పేమెంట్ బ్యాంకులు, లక్షా 46వేల మంది పోస్ట్‌మెన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌లు కల్గిన వ్యవస్ధ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు తెలిపింది.
ఇదీ చదవండి: Aadhar: సులభంగా ఆధార్ ఫొటో మార్చుకోండిలా..