Indigo Pilot Attacked By Passenger : దిల్లీ విమానాశ్రయంలో పైలట్‌పై దాడికి దిగాడు ఓ ప్రయాణికుడు. విమానం ఆలస్యంగా నడుస్తుందని పైలట్ ప్రకటన చేస్తున్న సమయంలోనే దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగింది.
-
VIDEO | An incident of a passenger assaulting an IndiGo pilot in the aircraft in Delhi when he announced flight delay was caught on camera.
— Press Trust of India (@PTI_News) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
The flight, which was delayed due to fog and low visibility, was scheduled from Delhi to Goa. IndiGo has filed a complaint regarding the… pic.twitter.com/inBHhKWkpK
">VIDEO | An incident of a passenger assaulting an IndiGo pilot in the aircraft in Delhi when he announced flight delay was caught on camera.
— Press Trust of India (@PTI_News) January 15, 2024
The flight, which was delayed due to fog and low visibility, was scheduled from Delhi to Goa. IndiGo has filed a complaint regarding the… pic.twitter.com/inBHhKWkpKVIDEO | An incident of a passenger assaulting an IndiGo pilot in the aircraft in Delhi when he announced flight delay was caught on camera.
— Press Trust of India (@PTI_News) January 15, 2024
The flight, which was delayed due to fog and low visibility, was scheduled from Delhi to Goa. IndiGo has filed a complaint regarding the… pic.twitter.com/inBHhKWkpK
ఇదీ జరిగింది
ఇండిగోకు చెందిన 6E 2175 విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి గోవా వెళ్లేందుకు సిద్ధమైంది. వాతావరణం సహకరించకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటన చేశారు. ఈక్రమంలోనే ఆగ్రహించిన ప్రయాణికుడు, చివర వరుస నుంచి వచ్చి పైలట్‌పై దాడి చేశాడు. ఇతర సభ్యులు అతడిని శాంతింపజేశారు. అందరు ప్రయాణికులు సహనంతో ఉండాలని కోరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన విమానయాన భద్రతా సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. నిందితుడిని సాహిల్ కటారియాగా గుర్తించిన భద్రతా అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇండిగో అంతర్గత కమిటీ ఏర్పాటు
మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన విమానయాన సంస్థ ఇండిగో, ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అనుచితంగా ప్రవర్తించిన నిందితుడిని నో-ఫ్లై జాబితాలో చేర్చడంపై ఈ కమిటీ సూచనలు చేయనున్నట్లు సమాచారం.
-
VIDEO | Visuals show the passenger, who assaulted the IndiGo pilot in Delhi when he announced flight delay, being taken by the authorities.
— Press Trust of India (@PTI_News) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
STORY | Passenger hits IndiGo pilot at Delhi airport over flight delay
READ: https://t.co/DIaaPE4GCL pic.twitter.com/35znqjHgeZ
">VIDEO | Visuals show the passenger, who assaulted the IndiGo pilot in Delhi when he announced flight delay, being taken by the authorities.
— Press Trust of India (@PTI_News) January 15, 2024
STORY | Passenger hits IndiGo pilot at Delhi airport over flight delay
READ: https://t.co/DIaaPE4GCL pic.twitter.com/35znqjHgeZVIDEO | Visuals show the passenger, who assaulted the IndiGo pilot in Delhi when he announced flight delay, being taken by the authorities.
— Press Trust of India (@PTI_News) January 15, 2024
STORY | Passenger hits IndiGo pilot at Delhi airport over flight delay
READ: https://t.co/DIaaPE4GCL pic.twitter.com/35znqjHgeZ
రెండో రోజూ ఆలస్యంగా విమానాల రాకపోకలు
దేశ రాజధానిలో పొగమంచు కారణంగా వరసగా రెండో రోజూ వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. పొగమంచు వల్ల దృశ్యనాణ్యత పడిపోయిందని ప్రయాణికులు బయలుదేరే ముందు తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని దిల్లీ విమానాశ్రయ అధికారులు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సూచించారు. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. జనవరి 14న దృశ్యనాణ్యత లేకపోవడం వల్ల ఉత్తర భారతదేశంలో రోజంతా తమ విమాన సర్వీసులపై ప్రభావం చూపిందని ఇండిగో సంస్థ ప్రకటించింది. విమానాల ఆలస్యం, రద్దుపై ఎప్పటికప్పుడు తమ సిబ్బంది ప్రయాణికులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. సోమవారం కూడా దిల్లీ వాతావరణంలో ఎలాంటి మార్పులేదు. పొగమంచు ప్రభావం రైళ్ల రాకపోకలపైనా పడింది. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
విమానం కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని పిలుచుకున్న పైలట్.. 3 గంటలు పాటు..
ఎయిర్ ఇండియాకు DGCA షాక్.. రూ.30 లక్షలు ఫైన్, పైలట్ లైసెన్స్ సస్పెండ్