దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014తో పోల్చితే 60శాతం వరకు పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఈ మేరకు చిరుత పులుల గణన నివేదిక 2018ని అటవీశాఖ అధికారుల సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో 12 వేల 852 చిరుత పులులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
వన్యప్రాణుల సంరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు... చిరుత పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయని జావడేకర్ సంతోషం వ్యక్తం చేశారు.