కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దేశంలో మొదటి స్కిన్ బ్లాక్ ఫంగస్(Fungus) కేసు నమోదవ్వడం కలకలం రేపింది. చిత్రదుర్గ జిల్లాలో 50 ఏళ్ల రోగిలో స్కిన్ బ్లాక్ ఫంగస్(Fungus) కనిపించిందని దేశంలో ఇదే మొదటి కేసు అని వైద్యుల బృందం వెల్లడించింది. నెల క్రితం కరోనా వైరస్ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్ ఫంగస్ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని వివరించారు.

బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్ ఫంగస్ కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్ ఫంగస్‌ను తొలగించగా ఇప్పుడు రెండో దశ చికిత్సకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి: Black Fungus: మెదడుకూ పాకిన వ్యాధి