ETV Bharat / bharat

చంద్రయాన్​-2కు అతి దగ్గరగా నాసా ఆర్బిటర్​- ఆ తర్వాత ఏమైంది? - నాసా

భారత్​కు చెందిన చంద్రయాన్​-2 వ్యోమనౌకకు(india chandrayaan 2) నాసాకు చెందిన ఆర్బిటర్(nasa orbiter)​ అత్యంత సమీపంలోకి వచ్చి ఢీకొనే ప్రమాదం ఏర్పడింది. అయితే.. ఈ ప్రమాదం నుంచి తప్పించేందుకు కీలకమైన క్యామ్​ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో(isro news today) తెలిపింది.

Chandrayaan-2
చంద్రయాన్​-2 సమీపంలోకి నాసా ఆర్బిటర్
author img

By

Published : Nov 17, 2021, 6:10 PM IST

నాసాకు చెందిన లూనార్​ రికనైసెన్స్​ ఆర్బిటర్​(ఎల్​ఆర్​ఓ)ను(nasa orbiter) ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భారత్​కు చెందిన చంద్రయాన్​-2 వ్యోమనౌక(india chandrayaan 2) కీలక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో(isro news today) వెల్లడించింది. ప్రమాదానికి గురికాకుండా చేయగలిగినట్లు తెలిపింది.

చంద్రయాన్​-2 ఆర్బిటర్​(సీహెచ్​2ఓ)(chandrayaan 2 news), ఎల్​ఆర్​ఓ చంద్రుడి ఉత్తర ధృవంలో.. అత్యంత సమీపంలోకి ఈ ఏడాది అక్టోబర్​ 20న 05.45యూటీసీ( ఉదయం 11.15 ఐఎస్​టీ) వస్తాయని గుర్తించినట్లు బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తోన్న అంతరిక్ష ఏజెన్సీ తెలిపింది. అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు రెండు స్పేస్​క్రాఫ్ట్స్​ మధ్య కేవలం 100మీటర్ల రేడియల్​ దూరం ఉంటుందని ఒకవారం ముందు అంచనా వేసింది. ఆ సమయానికి అవి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో అత్యంత సమీపానికి వచ్చి ఢీ కొట్టుకోకుండా చూసేందుకు క్యామ్​'(సీఏఎం)(collision avoidance maneuver) అవసరమని నాసా, ఇస్రోలు(isro news) భావించినట్లు తెలిపింది.

పరస్పర అంగీకారం మేరకు చంద్రయాన్​-2(chandrayaan 2 news) క్యామ్​ ప్రక్రియను చేపట్టేందుకు నిర్ణయించారు. అందుకు అక్టోబర్​ 18వ తేదీని ఖరారు చేశారు. రెండు నౌకలు భవిష్యత్తులోనూ సమీపానికి వచ్చే క్రమంలో తగినంత రేడియల్​ దూరం ఉండేలా ఈ ప్రక్రియను రూపొందించారు. అక్టోబర్​ 18న 14.52 యూటీసీ(రాత్రి 8.22) ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. విజయవంతంగా పూర్తయిన తర్వాత చంద్రయాన్​-2 ఆర్బిట్​ డేటా ప్రకారం భవిష్యత్తులోనూ ఎప్పుడు ఎల్​ఆర్​ఓతో ప్రమాదకరంగా అత్యంత సమీపానికి వచ్చే అవకాశం లేదనే అంచనాకు వచ్చినట్లు వెల్లడించింది.

అంతరిక్ష వస్తువులు​, శిథిలాలతో ఢీకొనే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు క్యామ్​ ప్రక్రియను భూకక్ష్యలోని శాటిలైట్లకు నిర్వహించటం సాధారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రమాదకరంగా వ్యోమనౌకలు సమీపంలోకి వచ్చే అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఇస్రో తెలిపింది. అలాంటి ప్రమాదం ఎదురైనప్పుడు క్యామ్​ ప్రక్రియను నిర్వహిస్తామని పేర్కొంది. అయితే.. ఇస్రో ప్రయోగించిన వాటికి ఇలాంటి ప్రమాదం ఎదురవటం ఇదే తొలిసారని తెలిపింది.

ఇదీ చూడండి: చంద్రయాన్-2 ఘనత.. జాబిల్లి చుట్టూ 9 వేల సార్లు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.