ETV Bharat / bharat

'అరవై ఏళ్లుగా దిగుమతి చేసుకుంటున్నాం.. ఇకపై భారత్​లోనే తయారీ'

Indian Railways Wheel Tender : భారతీయ రైలు చక్రాలు ఇక పూర్తిస్థాయిలో స్వదేశంలో తయారు కానున్నాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రైవేటు సంస్థలకు కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఇవ్వనున్నారు. ఆరవై ఏళ్లుగా రైలు చక్రాలు దిగుమతి చేసుకుంటున్నామని.. ఇప్పుడు స్వదేశంలో తయారు చేయాల్సిన అవసరం వచ్చిందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

indian railways wheels
central government decided to produce 80 thousand indian railways wheels per year in the country
author img

By

Published : Sep 9, 2022, 10:53 PM IST

Updated : Sep 10, 2022, 6:05 AM IST

Indian Railways Wheel Tender : రైల్వే చక్రాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవడంతో పాటు ఎగుమతులు సైతం చేపట్టే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఓ బ్లూ ప్రింట్‌తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఏడాదికి 80వేల చక్రాలను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు టెండర్‌ ఆహ్వానిస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. హైస్పీడ్‌ రైళ్లకు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు అవసరమైన చక్రాలను ‘మేకిన్‌ ఇండియా’ ప్లాంట్‌లో తయారీకి నిర్ణయించినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏడాదికి రూ.600 కోట్ల విలువైన 80వేల చక్రాలు తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైలు చక్రాల తయారీకి ప్రైవేటు వ్యక్తులను ఈ విధంగా ఆహ్వానించడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర మంత్రి చెప్పారు.

భారతీయ రైల్వేకు ఏటా రెండు లక్షల రైలు చక్రాలు అవసరం. ఇందులో కొన్నింటిని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సమకూరుస్తోంది. తాజా ప్రణాళిక ప్రకారం మిగిలిన వాటిని మేకిన్‌ ఇండియా ప్లాంట్‌ సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌, జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి యూరప్‌ దేశాల నుంచి రైల్వే శాఖ చక్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిణామాల నేపథ్యంలో అక్కడి నుంచి చక్రాల దిగుమతి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ దేశీయంగా ఉత్పత్తికి నిర్ణయించింది. మరోవైపు 30వేల వందేభారత్‌ ట్రైన్‌ వీల్స్‌ కోసం చైనా కంపెనీకి ఇప్పటికే కేంద్రం ఆర్డర్‌ ఇచ్చింది.

60ఏళ్లుగా యూరోపియన్‌ దేశాల నుంచి రైలు చక్రాలను దిగుమతి చేసుకుంటున్నామని, ఇప్పుడు దేశీయంగా తయారు చేపట్టడంతో పాటు ఎగుమతులూ చేపట్టేందుకు నిర్ణయించామని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ముడి సరకుల అందుబాటు, టెక్నికల్‌ అనాలసిస్‌ అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. దేశీయంగా తయారీ వల్ల ఒక్కో చక్రానికి సుమారు రూ.70వేల చొప్పున రైల్వేకు ఆదా అవుతుందని తెలిపారు. త్వరలో మేకిన్‌ ఇండియా ట్రాక్‌లకు సైతం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారీతో పాటు విదేశాలకు ముఖ్యంగా యూరప్‌కు సైతం వీల్స్‌ ఎగుమతి చేసేలా ముందుకొచ్చే వారికే కాంట్రాక్ట్‌ అప్పగిస్తామని షరతు విధించినట్లు చెప్పారు.

ఇవీ చదవండి: 'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్

ఆరు నెలల చిన్నారికి పూజలు.. దర్శనం కోసం వందలాది మంది క్యూ.. ఆ మచ్చలే కారణం

Last Updated : Sep 10, 2022, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.