ETV Bharat / bharat

రైల్వేలో అప్రెంటీస్​ ఉద్యోగాలు.. ఆ సర్టిఫికెట్లు ఉంటే చాలు.. అప్లైకి 15 రోజులే ఛాన్స్ - రైల్వే జాబ్స్

Railway Jobs : రైల్వేలో ఉద్యోగం చేయాలని ఎదురుచూసే ఆశావాహులకు గుడ్​ న్యూస్​. మొత్తం 1104 అప్రెంటీస్​ రైల్వే కొలువుల కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​. మరి ఈ జాబ్స్​ ఏ రైల్వే డివిజన్​లో, ఏం పోస్టులు, జీతం ఎంత, ఎవరు అర్హులు, ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మీ కోసం.

Indian Railways RRC Recruitment 2023
రైల్వేలో అప్రెంటీస్​ ఉద్యోగాలు.. ఆ సర్టిఫికెట్లు ఉంటే చాలు.. కేవలం 15 రోజులే..
author img

By

Published : Jul 18, 2023, 11:49 AM IST

Railway Jobs 2023: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏ విభాగంలోనైనా ఉద్యోగం సంపాదించాలనే కల అందరికి ఉంటుంది. అలాంటి వారికి శుభవార్త చెప్పింది రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​. మొత్తం 1104 అప్రెంటీస్​ రైల్వే కొలువులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈశాన్య రైల్వే (నార్త్​ ఈస్టర్న్​​ రైల్వే)లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసినవారు ఈ అప్రెంటీస్​ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈశాన్య రైల్వే (నార్త్​ ఈస్టర్న్​ రైల్వే)లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇవి..

వర్క్​షాప్​ పోస్టులు
మెకానికల్​ వర్క్​షాప్​- గోరఖ్​పుర్​ 411
సిగ్నల్​ వర్క్​షాప్​- గోరఖ్​పుర్​ 63
బ్రిడ్జ్​ వర్క్​షాప్​- గోరఖ్​పుర్​ 35
మెకానికల్​ వర్క్​షాప్​- ఇజ్జత్​నగర్ 151
డీజిల్​ షెడ్​- ఇజ్జత్​నగర్​ 60
క్యారేజ్​ అండ్​ వేగన్​- ఇజ్జత్​నగర్ 4​
క్యారేజ్​ అండ్​ వేగన్​- లఖ్​నవూ జంక్షన్ 155
డీజిల్​ షెడ్​- గోండా 90
క్యారేజ్​ అండ్​ వేగన్​- వారణాసి 75

Railway Jobs Recruitment 2023 : పైన తెలిపిన వర్క్​షాపుల్లోని ఫిట్టర్​, వెల్డర్​, ఎలక్ట్రిషియన్​, కార్పెంటర్​, పెయింటర్​, మెషినిస్ట్​, టర్నర్​, మెకానికల్​ డీజిల్​, ట్రిమ్మర్​ విభాగాల్లో ఈడబ్యూఎస్​, ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీ, ఎక్స్​ సెర్వీస్​మెన్​ సహా ఇతర కేటగిరీల రిజర్వేషన్​ ఆధారంగా పోస్టులను విభజించి కేటాయించారు. ఏఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు కేటాయించారో వంటి పూర్తి వివరాలు indian railways.gov.in లేదా RRC-North Eastern Railway అధికారిక వెబ్​సైట్​లో వీక్షించొచ్చు.

ఈ వయసు వారు మాత్రమే..
నార్త్​ ఈస్టర్న్​​ రైల్వే రీజియన్​లో అప్రెంటీస్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే 2023 ఆగస్టు 2 నాటికి 24 సంవత్సరాలు మించకూడదు.

వీరికి మాత్రమే వయోపరిమితి పెంపు..

  • ఓబీసీ అభ్యర్థులు- 3 సంవత్సరాలు (24+3). అంటే ఈ కేటగిరీ వారు 2023 ఆగస్టు 2 నాటికి 27 సంవత్సరాలు దాటకూడదు.
  • ఎస్​సీ/ఎస్​టీ అభ్యర్థులు- 5 సంవత్సరాలు (24+5). 2023 ఆగస్టు 2 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు.
  • దివ్యాంగులు- 10 సంవత్సరాలు (24+10). 2023 ఆగస్టు 2 నాటికి 34 సంవత్సరాలు ఉండాలి.
  • ఇక ఎక్స్​-సెర్వీస్​ మెన్​ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితి నుంచి మినహాయింపులు ఉన్నాయి. www.ner.indianrailways.gov.in వెబ్​సైట్​లో ఈ వివరాలు చూడొచ్చు.

విద్యార్హతలు..
పదో తరగతితో పాటు ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ అప్రెంటీస్​ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్​ తప్పనిసరి.

ఎంపిక ఇలా..
టెన్త్​, ఐటీఐలో మీకు వచ్చిన మెరిట్​ స్కోర్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్​ అయిన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలన కోసం సంబంధిత తేదీ రోజు పిలుస్తారు. ఇందుకోసం అధికారిక వెబ్​సైట్​ను చెక్​ చేసుకోవాలి.

ఎలా అప్లై చేసుకోవాలి..?
రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ అధికారిక వెబ్​సైట్​ www.ner.indianrailways.gov.in లో ఆన్​లైన్​లో అభ్యర్థులు తమకు నచ్చిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్​ ఫీజు..
ఓబీసీతో పాటు జనరల్​ క్యాటగిరీ అభ్యర్థులు (పురుషులు) మాత్రమే రూ.100 చెల్లించి ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. మిగితా వారికి (ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్​, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు) ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు చివరితేదీ..
2023 ఆగస్టు 02 సాయంత్రం 5 గంటల దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రైనింగ్​లో స్టైపెండ్​..
పైన తెలిపిన పోస్టులకు ఏంపికైన అభ్యర్థులకు అప్రెంటీస్‌షిప్ కౌన్సిల్ సూచించిన ప్రమాణాల మేరకు ఒక సంవత్సరం పాటు శిక్షణను ఇస్తారు. శిక్షణ కాలంలో స్టైపెండ్​ను కూడా చెల్లిస్తారు.
గమనిక : ఇంజినీరింగ్​ గ్యాడ్యూయేట్స్​, డిప్లొమా చదివిన విద్యార్థులు ఈ పోస్టులకు అనర్హులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.