ETV Bharat / bharat

ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో 275 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - నేవీ అప్రెంటీస్ జాబ్స్​ 2023

Indian Navy Apprentice Jobs 2023 In Telugu : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ.. విశాఖపట్నంలోని నావల్​ డాక్​యార్డ్​లో ఖాళీగా ఉన్న 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి​, దరఖాస్తు విధానం​ తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Indian Navy Recruitment 2023
Indian Navy Apprentice Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 10:44 AM IST

Indian Navy Apprentice Jobs 2023 : భారత నావికాదళం 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలోని నావల్​ డాక్​యార్డ్​లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు

  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్​ - 36
  • ఫిట్టర్​ - 33
  • షీట్​ మెటల్​ వర్కర్​ - 33
  • కార్పెంటర్​ - 27
  • మెకానిక్​ (డీజిల్​) - 23
  • పైప్ ఫిట్టర్ - 23
  • ఎలక్ట్రీషియన్​ - 21
  • పెయింటర్​ (జనరల్​) - 16
  • R & A/C మెకానిక్ - 15
  • వెల్డర్ (గ్యాస్​ & ఎలక్ట్రిక్​) - 15
  • మెషినిస్ట్​ - 12
  • ఇన్​స్ట్రుమెంట్​ మెకానిక్ - 10
  • మెకానిక్ మెషిన్ టూల్​ మెయింటెనెన్స్​ - 6
  • ఫౌండ్రీమ్యాన్​ - 5
  • మొత్తం పోస్టులు - 275

విద్యార్హతలు
Navy Apprentice Qualifications : అభ్యర్థులు 55 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 65 శాతం మార్కులతో ఐటీఐ (NCVT/SCVT) క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
Navy Apprentice Age Limit : మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్​మెంట్ అండ్ ఎంటర్​ప్రెన్యూర్​షిప్ ప్రకారం, అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు. అయితే అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల్లో పనిచేసే అభ్యర్థుల కనీస వయస్సు మాత్రం 18 సంవత్సరాలు ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి.

స్టైపెండ్​
Navy Apprentice Salary : నేవీ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం ట్రైనింగ్​లో నెలకు రూ.7,700 చొప్పున అందిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.8,050 చొప్పున ఇస్తారు.

దరఖాస్తు విధానం
Navy Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటీస్​ ప్రమోషన్​ స్కీమ్​ (NAPS) స్కీమ్ కింద https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • అయితే ఇలా రిజిస్టర్ చేసుకోవడానికి ముందే.. అభ్యర్థులు ఆధార్​ కార్డ్​, SSC/ మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్​ రెండింటిలోనూ తమ పేరు, పుట్టిన తేదీ ఒకేలా ఉన్నాయా? లేదా? చెక్​ చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే, అందుకు తగిన మార్పులు చేసుకోవాలి.
  • అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్లో తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్​, ఈ-మెయిల్ లాంటి వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక యూజర్​ నేమ్​, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.
  • మీరు ఈ యూజర్​ నేమ్​, పాస్​వర్డ్​లతో మరలా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్​లోకి లాగిన్ అయ్యి మీ విద్యార్హతల వివరాలు, చిరునామా, ట్రేడ్ ప్రిఫరెన్స్​, ఆధార్​, పాన్​, బ్యాంక్ డీటైల్స్​, కమ్యూనిటీ వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. తరువాత ఆధార్​ నంబర్​ను వ్యాలిడేట్ చేసుకోవాలి. తరువాత..
  • అన్ని వివరాలను మరోసారి చెక్​ చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్​ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :
Navy Apprentice Important Dates :

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 1
  • రాత పరీక్ష (ఆల్​ ట్రేడ్స్​) తేదీ : 2024 ఫిబ్రవరి 28
  • పరీక్ష ఫలితాల వెల్లడి : 2024 మార్చి 02
  • ఇంటర్వ్యూ తేదీ : 2024 మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు.

డిగ్రీ అర్హతతో SBIలో 5280 CBO పోస్టులు - జీతం ఎంతంటే?

డిగ్రీ విద్యార్ఖులకు గుడ్​న్యూస్​- IDBI బ్యాంకులో 2100 ఉద్యోగాలు- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.