ETV Bharat / bharat

బంగాళాఖాతం తీరంపై యాస్‌ తుపాను పడగ - యాస్​ తుపాను వార్తలు

దేశ పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే తూర్పు తీరం దిశగా యాస్ తుపాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. ఆ తర్వాత 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. రేపు ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఫలితంగా ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

yass
బంగాళాఖాతం తీరంపై యాస్‌ తుపాను పడగ
author img

By

Published : May 25, 2021, 5:37 AM IST

Updated : May 25, 2021, 6:49 AM IST

తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా సోమవారం 'యాస్‌' తుపాను ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం లోగా తీవ్ర తుపానుగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి, ఈ నెల 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటనున్నట్లు వారు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 185 కి.మీ. వరకూ పెరిగే అవకాశముందన్నారు. ఆ తర్వాత అది క్రమేపీ బలహీనపడిపోతుందని చెప్పారు.

తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు

తుపాను ప్రభావంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 'మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్‌ తీరంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తీవ్రత కొనసాగుతుంది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఈ నెల 26న తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్రలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుంది' అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి 27లోపు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల ఉంటాయన్నారు. చేపల వేట నిషేధ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి యాస్‌ తుపాను గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. అది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో, పారాదీప్‌కి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

సీఎంలతో అమిత్‌షా సమీక్ష

'యాస్‌' తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సూచించారు. తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీ, అండమాన్‌ నికోబార్‌ దీవులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దేవేంద్ర కుమార్‌ జోషిలతో షా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర శాఖలు అన్ని విధాలుగా సహకరిస్తాయని హామీ ఇచ్చారు. సాధ్యమైనంతమేరకు విద్యుత్పత్తి కేంద్రాల్లో సరఫరా నిలిచిపోకుండా చూడాలని కోరారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లపై తుపాను ప్రభావం, వాటి రక్షణపై చర్చించారు. రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు అధికంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులను సముద్రం నుంచి వెంటనే వెనక్కి పిలిపించాలని, లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 24 గంటలూ ఒక కంట్రోల్‌ రూమ్‌ పని చేస్తుందని తెలిపారు.

మమత అసంతృప్తి

తుపానుపై అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్రం చెప్పినా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు రూ.600 కోట్లు చొప్పున అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చి.. జనాభాలో అంతకంటే పెద్దదైన తమ రాష్ట్రానికి మాత్రం రూ.400 కోట్లే ఇచ్చారని బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రంపై పదేపదే వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. 'ఈ విషయాన్ని అమిత్‌షాతో వీడియో సమావేశంలో ప్రస్తావించాను. శాస్త్రీయమైన కోణంలో కేటాయింపులు ఉంటాయని ఆయన చెప్పారు. అదేంటో నాకు తెలియదు కాబట్టి నేనేమీ సమాధానమివ్వలేదు' అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.

ఇదీ చూడండి: తీవ్ర తుపానుగా యాస్- అమిత్​షా సమీక్ష

Last Updated : May 25, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.