ETV Bharat / bharat

భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా లాంఛ్.. ధర ఎంతంటే..

భారత్ బయోటెక్ రూపొందించిన ఇన్​కొవాక్ నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మన్​సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్.. ఈ టీకాను ఆవిష్కరించారు.

COVID-NASAL-VACCINE
కేంద్ర మంత్రులతో కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
author img

By

Published : Jan 26, 2023, 3:36 PM IST

Updated : Jan 26, 2023, 5:18 PM IST

భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ టీకాను గురువారం దిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు.
"ఈ టీకా పంపిణీ చాలా సులువు. సూది అవసరం లేదు. ఈ టీకాతో ఐజీజీ, ఐజీఏ, టీ-సెల్ అనే మూడు రకాల ప్రతిస్పందనలు వస్తాయి. ప్రపంచంలో మరే ఇతర వ్యాక్సిన్​తో ఇది సాధ్యం కాదు" అని కృష్ణ ఎల్ల వివరించారు.

ఇన్​కొవాక్ పేరుతో భారత్ బయోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. గతేడాది నవంబర్​లోనే ఈ టీకా వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్‌ డోసుగా అందించేందుకు పచ్చజెండా ఊపింది. కొవిన్ ప్లాట్​ఫామ్​లోనూ ఈ టీకాను చేర్చారు. ఇకపై ప్రజలందరికీ ఈ టీకా అందుబాటులో ఉండనుంది.

COVID-NASAL-VACCINE
టీకాను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రులు
COVID-NASAL-VACCINE
కేంద్ర మంత్రులతో కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల

ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్‌ నాసికా టీకాను బూస్టర్‌గా పొందొచ్చు. 'బీబీవీ154'గా పిలిచే ఈ నాసికా టీకా 'ఇంకొవాక్‌' బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. కరోనాపై పోరులో ఇది చాలా సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షలో తేలింది. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే తేడా ఏంటి?
ఈ టీకా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే (ముక్కులోనే) రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగిస్తుంది. తద్వారా వైరస్‌ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు.

ఎలా తీసుకోవాలి?
ఈ నాజల్​ వ్యాక్సిన్​ను ముక్కు ద్వారా తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న సూదితో వేసే వ్యాక్సిన్​లకు బదులుగా చుక్కల ద్వారా ముక్కులో వేసే కొత్త రకం వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చారు​.

టీకా ధర ఎంత?
సింగిల్‌ డోసు టీకా ధరను రూ.800 (పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ గతంలో ప్రకటించింది. భారీ స్థాయిలో సేకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.320కే ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Last Updated : Jan 26, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.