సరిహద్దు వివాదంపై భారత్-చైనా సైనికాధికారులు ఈ వారం మరోసారి భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. గోగ్రా పర్వతాలు, సీఎన్సీ జంక్షన్, దెప్సాంగ్ల నుంచి బలగాల ఉపసంహరణపై ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పాంగాంగ్ సరస్సు నుంచి ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన నేపథ్యంలో.. మిగిలిన వివాదాస్పద ప్రాంతాల్లోనూ పురోగతి సాధించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏడాది కాలంగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన.. సైనిక, రాజకీయ స్థాయిల్లో సమగ్ర చర్చల ద్వారా కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు కార్ప్స్ కమాండర్ స్థాయిలో పది సార్లు భేటీ కాగా.. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ గత నెలలోనే జరిగింది.
ఇదీ చూడండి: చైనా విదేశాంగ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ
ఇదీ చూడండి: సరిహద్దులో తోకముడిచిన చైనా- కారణమేంటి?