రాజస్థాన్‌కు చెందిన సందీప్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కార్పెంటర్ అయిన సందీప్.. కర్ర యంత్రం వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎడమ బొటనవేలు తెగిపడిపోయింది. అతనికి వచ్చే కొద్దిపాటి జీతంతో అక్కడ ఖరీదైన వైద్యం చేయించుకోలేకపోయాడ. దీనితో భారత్‌కు వచ్చేయాలనుకుని అక్కడి వైద్యులను సంప్రదించాడు. సందీప్ అభ్యర్థన మేరకు వారు బొటన వేలిని ఇతర వేళ్ల మధ్య ఉంచి కట్టు కట్టారు.
ఆ పరిస్థితుల్లో వెంటనే ఆలస్యం చేయకుండా భారతదేశానికి చేరుకున్నాడు. ఇక్కడ దిగీదిగగానే అతన్ని విమానాశ్రయానికి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. పరిశీలించిన వైద్యులు మూడు రక్త నాళాలు తెగిపోయాయని.. 24 గంటల్లో 300మిలీ రక్తం పోయిందని తెలిపారు.
"ఆసుపత్రికి వచ్చిన 10 నిమిషాల వ్యవధిలో మేము అతన్ని శస్త్రచికిత్స కోసం తీసుకువెళ్లాం. ఈ ప్రక్రియను సాంకేతికంగా రీ-ఇంప్లాంటేషన్ అని పిలుస్తారు. దీనిని పూర్తి చేసేందుకు ఆరు గంటల సమయం పట్టింది. ఇదో సంక్లిష్ట ప్రక్రియ"
---డాక్టర్ ఆశిష్ చౌదరి, ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్
ప్రస్తుతం సందీప్ కోలుకుంటున్నాడని.. మరో పక్షం రోజుల్లో పనిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.
'పూర్తిగా తెగిపడిన బొటనవేలును విజయవంతంగా తిరిగి అమర్చాం. ఇదో అరుదైన శస్త్రచికిత్స. మరో రెండు గంటలు ఆలస్యం అయి ఉంటే చికిత్స అదించే అవకాశాలు కేవలం 20-30 శాతం తగ్గి ఉండేవి'అని వైద్యులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: