Indian Army SSC Tech Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని ఆశించే ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ షార్ట్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా తాజాగా 196 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Engineering Jobs 2023 : ఇండియన్ ఆర్మీ 62వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ (ఏప్రిల్ 2024); 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు (ఏప్రిల్ 2024) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు, మహిళలు సహా, మిలటరీలో సేవలందించి అమరులైనవారి భార్యలు (వితంతువులు) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు
- ఎస్ఎస్సీ (టెక్) - 175 పోస్టులు
- ఎస్ఎస్సీడబ్లూ (టెక్) - 19 పోస్టులు
- ఎస్ఎస్సీడబ్ల్యూ టెక్ & నాన్ టెక్ - 02 పోస్టులు
పురుషుల ఖాళీల్లో విభాగాల వారీగా పోస్టులు
- సివిల్ - 47
- కంప్యూటర్ సైన్స్ - 42
- ఎలక్ట్రికల్ - 17
- ఎలక్ట్రానిక్స్ - 26
- మెకానికల్ - 34
- ఇతర విభాగాలు - 9
మహిళల ఖాళీల్లో విభాగాల వారీగా పోస్టులు
- సివిల్ - 4
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - 6
- ఎలక్ట్రికల్ - 2
- ఎలక్ట్రానిక్స్ - 3
- మెకానికల్ - 4
విద్యార్హతలు
- అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- SSCW (నాన్ టెక్) (నాన్ యూపీఎస్సీ) పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- SSCW (టెక్) పోస్టులకు ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 1997 ఏప్రిల్ 2 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్యలో జన్మించి ఉండాలి.
- విధి నిర్వహణలో అమరులైన వారి భార్యల (వితంతువుల) వయస్సు కచ్చితంగా 2024 ఏప్రిల్ 1 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
Indian Army Engineering Job Selection Process : అభ్యర్థులను వారి గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ మార్కుల మెరిట్ ఆధారంగా వడపోస్తారు. తరువాత వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ముఖ్యంగా సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో 2 దశల్లో ముఖాముఖి జరుగుతుంది. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారిని, 2 దశ ఇంటర్వ్యూకు తీసుకుంటారు. ఇందులో కూడా ఉత్తీర్ణలైనవారికి.. వైద్య పరీక్షలను నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు.
నోట్ : ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది.
శిక్షణ - వేతనాలు
Engineer jobs salaries : ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నైలో 2024 ఏప్రిల్ నుంచి శిక్షణ మొదలవుతుంది. అక్కడ 49 వారాల పాటు వీరికి శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. ఎవరైతే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తారో.. వారికి మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని కూడా అందిస్తారు. తరువాత వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులు 10 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తి మేరకు కొందరిని శాశ్వత ఉద్యోగాలకు (పర్మినెంట్ ఉద్యోగాలు) తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. తరువాత వీరి సర్వీస్ ముగిసిపోతుంది.
పదోన్నతులు
Indian Army Promotion Process : లెఫ్టినెంట్ విధుల్లో చేరిన తరువాత, 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను చేరుకోవచ్చు.
జీతభత్యాలు
Indian Army Job Salaries : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 (లెవెల్ 10) మూలవేతనంతో పాటు, మిలటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. అంటే తొలి నెల నుంచే లక్ష రూపాయల వరకు జీతం అందుతుంది. దీనితోపాటు పలు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.
దరఖాస్తుకు చివరి తేదీ
అప్లికేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. కనుక ఆసక్తిగల అభ్యర్థులు 2023 జులై 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.