భారత్- నేపాల్ బంధం ఇరు దేశాల ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలీతో శనివారం జరిగిన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంపై రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
-
Had a wonderful meeting with the Foreign Minister of Nepal, Shri @PradeepgyawaliK today. India’s relations with Nepal are not limited to governments in both the countries but it is driven by the people of the both the nations. India-Nepal relations offer limitless potential. pic.twitter.com/zFAMsz1Isz
— Rajnath Singh (@rajnathsingh) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Had a wonderful meeting with the Foreign Minister of Nepal, Shri @PradeepgyawaliK today. India’s relations with Nepal are not limited to governments in both the countries but it is driven by the people of the both the nations. India-Nepal relations offer limitless potential. pic.twitter.com/zFAMsz1Isz
— Rajnath Singh (@rajnathsingh) January 16, 2021Had a wonderful meeting with the Foreign Minister of Nepal, Shri @PradeepgyawaliK today. India’s relations with Nepal are not limited to governments in both the countries but it is driven by the people of the both the nations. India-Nepal relations offer limitless potential. pic.twitter.com/zFAMsz1Isz
— Rajnath Singh (@rajnathsingh) January 16, 2021
"నేపాల్ విదేశాంగ మంత్రితో ఈ రోజు సమావేశం జరిగింది. భారత్, నేపాల్ బంధం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాదు. ఇరు దేశాల ప్రజలకు కూడా బంధం ఉంది. భారత్ నేపాల్ మధ్య సంబంధాలు అపరిమిత శక్తిని అందిస్తాయి."
-రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి
మూడు రోజుల పర్యటనలో భాగంగా నేపాల్ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలీ శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ అయ్యారు. నేపాల్‌తో ఇటీవల ఏర్పడ్డ సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
సైనికులపై రాజ్‌నాథ్ ప్రశంసలు..
భేటీ అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని సైనిక ఆస్పత్రి భూమి పూజలో పాల్గొన్న రాజనాథ్.. సైనికులను ప్రశంసించారు. చైనాతో సరిహద్దు వివాద సమయంలో భారత సైనికులు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారన్నారు. ప్రజలను తలెత్తుకునేలా చేశారని, వారిలో ఎలాంటి ప్రమాదం లేదనే నమ్మకాన్ని పెంచారని అన్నారు. ఈ ఆస్పత్రి ప్రారంభమైతే పదవి విరమణ చేసిన సైనికులకు మేలు కలుగుతుందని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి : కొవిడ్ జ్ఞాపకాలు తలచుకొని మోదీ కన్నీటిపర్యంతం