ETV Bharat / bharat

Indian Army Exercise : దూసుకుపోయిన ట్యాంకులు.. గర్జించిన ఫిరంగులు.. ఔరా అనిపించిన సైన్యం విన్యాసాలు..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 4:44 PM IST

Updated : Aug 31, 2023, 5:34 PM IST

Indian Army Exercise 2023 : దూసుకుపోయిన ట్యాంకులు, గర్జించిన ఫిరంగులు, శతఘ్నులు. ఆకాశం నుంచి పెద్ద ఎత్తున హెలికాఫ్టర్ల దాడి.. రాజస్థాన్‌లో పోఖ్రాన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. యుద్ధమే జరుగుతుందా అనే రీతిలో చేసిన సైనిక కసరత్తును బ్రెజిల్‌ సైనిక జనరల్‌ టోమస్ మిగ్యుల్ ఆసక్తిగా తిలకించారు. మేడ్ ఇన్‌ ఇండియా తయారీ ఆయుధాలు, పరికరాల పనితీరును నిశితంగా పరిశీలించారు.

indian-army-exercise-2023-before-on-brazil-military-general-omas-miguel-mine
రాజస్థాన్​లో భారత సైన్యం విన్యాసాలు 2023
భారత సైన్యం విన్యాసాలు

Indian Army Exercise 2023 : ప్రపంచపు అత్యుత్తమ సైనిక బలగాల్లో ఒకటైన భారత్‌.. నిరంతరం తన సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటూనే ఉంటుంది. ఆధునిక ఆయుధాల వినియోగం నుంచి.. అనితర సాధ్యమైన విన్యాసాలు, సాహసాలు చేయడంలో.. మన వీర సైనికులు అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోరు. యుద్ధక్షేత్రంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే విషయంలో మన సైన్యం నిరంతరం తర్ఫీదు పొందుతూనే ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యాలను పరీక్షించుకుంటోంది. అందులో భాగంగానే తరచూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది.

Recent Indian Military Exercises 2023 : తాజాగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత సైన్యం చేసిన విన్యాసాలు ఔరా అనిపిస్తున్నాయి. భారత పర్యటనకు వచ్చిన బ్రెజిలియన్ సైనిక జనరల్ టోమస్ మిగ్యుల్ మైన్‌ రిబీరో పైవా సమక్షంలో మన సైన్యం తన సత్తాను ప్రదర్శించింది. యుద్ధక్షేత్రాన్ని తలపించేలా భారీ ఎత్తున విన్యాసాలను నిర్వహించింది. ఈ సందర్భంగా దేశీయ తయారీ ఆయుధాలను ప్రదర్శించింది. భారత్‌లో తయారైన అర్జున ట్యాంకులు, ALH ధ్రువ్‌ హెలికాఫ్టర్లు.. తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఆకాశ్‌ మిసైల్‌ వ్యవస్థతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఇతర క్షిపణులను కూడా భారత సైన్యం తమ విన్యాసాల్లో ఉపయోగించింది.

indian military exercise 2023 Pokhran : ట్యాంకులు, శతఘ్నులు, డ్రోన్లు, హెలికాఫ్టర్లు పరస్పర సమన్వయంతో చేసిన విన్యాసాలు ఉత్కంఠను రేపాయి. రెప్పపాటు వేగంతో శత్రువులపై చేసే దాడిని ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించింది. భారత సైన్యం విన్యాసాలతో పోఖ్రాన్ రేంజ్‌ మార్మోగిపోయింది. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఆయుధ వ్యవస్థలపై బ్రెజిల్ సైనిక జనరల్‌ ఆసక్తి కనబరిచారు. భారత్‌లో సెప్టెంబరు 2 వరకూ ఆయన పర్యటన సాగనుంది. జనరల్‌ టోమస్ మిగ్యుల్ పర్యటన బలమైన భారత్‌-బ్రెజిల్‌ సంబంధాలకు, ఇరుదేశాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగశాఖ, రక్షణశాఖలు పేర్కొన్నాయి.

ఆకట్టుకున్న 'ఎయిర్​ ఫెస్ట్​' సైనిక విన్యాసాలు..
1971 భారత్​- పాకిస్థాన్​ యుద్ధంలో భారత విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు సూలూరులో దేశ వైమానిక దళం 'ఎయిర్​ ఫెస్ట్​' నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సైనికుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వైమానిక దళానికి చెందిన పలు యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్​లను ప్రదర్శించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్​ ఎంకే-1 ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

1500 మంది మహిళలతో ఆర్మీని చుట్టుముట్టిన 'ఆమె'.. క్షణాల్లో 12 మంది తీవ్రవాదుల్ని విడుదల చేయించుకుని..

Parliament Special Session 2023 : 5రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఎప్పటి నుంచంటే?

Last Updated : Aug 31, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.