ETV Bharat / bharat

'నేపాల్ ఆర్మీ జనరల్​'గా నరవాణే!

author img

By

Published : Nov 4, 2020, 5:34 AM IST

Updated : Nov 4, 2020, 6:37 AM IST

సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు కీలక ద్వైపాక్షిక అంశాలు చర్చించటానికి భారత సైన్యాధిపతి జనరల్​ ఎం.ఎం నరవాణే నేడు నేపాల్ చేరుకోనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది.

Indian Army chief visit to Nepal to improve strained ties
కీలక అంశాల పరిష్కారం దిశగా నరవాణే నేపాల్​ పర్యటన

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే నేటి నుంచి మూడు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించనున్నారు. రక్షణ, భద్రతా అంశాలపై అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ, రక్షణ మంత్రి ఈశ్వర్​ పోఖ్రెల్​, ఆర్మీ చీఫ్​ పూర్ణ చంద్ర థాపాలతో నరవాణే భేటీ కానున్నారు.

ఈ పర్యటనలో నేపాల్​ ప్రధానిని కలుస్తున్నాను. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి చర్చలు జరగనున్నాయి. ఆ దేశ అధ్యక్షురాలు నుంచి గౌరవ 'జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ' ర్యాంకు తీసుకొబోతుండడం ఆనందంగా ఉంది.

- జనరల్​ ఎం.ఎం నరవాణే, భారత ఆర్మీ చీఫ్

పర్యటన సాగనుందిలా....

నేటి నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటనలో భారత-నేపాల్​ మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు చర్చలు జరగనున్నాయి. 1950లో ప్రారంభమైన పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జనరల్​ నరవాణేకు నేపాల్​ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి 'జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ' గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం కాఠ్మాండులో జరగనుంది. భారత్ కూడా 'జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ' గౌరవ ర్యాంకును నేపాల్ ఆర్మీ చీఫ్‌కు ప్రదానం చేస్తుంది.

నేపాల్​ కొత్త మ్యాప్​​ తర్వాత తొలిసారి పర్యటన...

ఇటీవల నేపాల్​ ప్రకటించిన కొత్త మ్యాప్​ విషయంలో ఇరుదేశాలకు మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఇరువురికీ దాదాపు 1800 కి.మీ మేర సరహద్దు ఉంది. భారత్​లోని లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్​ కొత్త మ్యాప్​ను విడుదల చేశాక.. ఇరుదేశాల మధ్య జరుగుతున్న తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే.

ఇదీ చూడండి:కాలాపానీ మాదేనంటూ నేపాల్ కొత్త మ్యాప్

పర్యటన ప్రత్యేకమే...

సరిహద్దుల్లో ఒత్తిడి పెంచుతున్న చైనా.. భారత సరిహద్దు దేశాలను తమ వైపు తిప్పుకొని మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్​తో కలిసి రెండు వైపుల నుంచి దాడి చేస్తున్న చైనా.. నేపాల్​లోనూ కాలుమోపి త్రిముఖ దాడి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఈ హిమాలయ దేశంలో పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. వాటిపై నేపాల్​ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అయితే చైనాకు దీటైన ప్రత్యర్థి మనమే కావడం వల్ల.. నేపాల్​కు అండగా ఉండి ఈ విషయంలో ​కీలకంగా వ్యవహరించనుంది భారత్​.

ఇదీ చూడండి:భారత్​-నేపాల్​ విభేదాలకు కారణాలు ఇవేనా?

వైద్య సాయం..

కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో నేపాల్​కు వైద్యపరమైన సాయం చేయాలని భారత్​ నిర్ణయించింది. పలు వైద్య పరికరాలతో పాటు , వెంటిలేటర్లను జనరల్ నరవాణే అందజేయనున్నారు. శివపురిలోని కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న అధికారులతో ముచ్చటించనున్నారు.

ఇదీ చూడండి: భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

Last Updated : Nov 4, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.