ETV Bharat / bharat

'ఆర్మీ నియామకాల కేసు సీబీఐకి బదిలీ' - పుణె

ఆర్మీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎంపిక కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న అంశం బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

Indian Army asks CBI to probe alleged malpractices in officers' selection at Kapurthala centre
ఆర్మీ నియామకాల కేసు సీబీఐకి
author img

By

Published : Mar 14, 2021, 11:50 AM IST

ఆర్మీ నియామకాల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆర్మీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ముందు జాగ్రత్త చర్యగా నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో అవకతవకల విషయం వెలుగులోకి వచ్చింది. ఎంపిక కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు తెలిసిన అనంతరం.. దర్యాప్తు చేపట్టింది. అదే సమయంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. 'భారత సైన్యానికి జరిగే ఎంపికల్లో అవకతవకలను ఏమాత్రం సహించేది లేదు' అని ఈ సందర్భంగా సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

గత ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగిన జనరల్‌ డ్యూటీ పర్సనల్స్‌ ఎంపికలో పేపర్‌ ముందే బయటకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో.. స్థానిక పోలీసులతో కలిసి సైన్యం సంయుక్త ఆపరేషన్‌ చేసి దీనిని భగ్నం చేసింది. ఆ తర్వాత పరీక్షను రద్దు చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో పుణెలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: జవాన్​ హనీట్రాప్- పాక్​కు రహస్య సమాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.