భారత వైమానిక దళానికి చెందిన ఏఆర్‌పీఏ నిఘా డ్రోన్ పంజాబ్ పొలాల్లో కుప్పకూలింది. సాంకేతిక లోపాల వల్ల గుర్దాస్పుర్ మాలోగిల్ గ్రామంలో ఈ డ్రోన్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్‌ను భారత వైమానిక దళానికి అందించారు బీఎస్ఎఫ్ జవాన్లు.
"కాంటాక్ట్ కోల్పోయిన తర్వాత డ్రోన్ కోసం ఎయిర్ ఫోర్స్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. సంబంధాలు తెగిపోయే ముందు డ్రోన్ ఉన్న ప్రాంతాల్లో వెతికింది. గంటన్నర తర్వాత మాలోగిల్ ప్రాంతంలో డ్రోన్ పడిపోయి కనిపించింది" అని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.
తొలుత తమ ప్రాంతంలో హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టడం వల్ల భయభ్రాంతులకు గురైనట్లు కొందరు స్థానికులు తెలిపారు. కాసేపటి తర్వాత వైమానిక దళానికి చెందిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అసలు విషయం చెప్పారు.
ఇదీ చదవండి:డ్రోన్ దాడులకు చెక్ పెట్టేలా సైన్యం కీలక నిర్ణయం