ETV Bharat / bharat

'చైనా అలా చేస్తేనే భారత బలగాలు వెనక్కి'

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనకు చైనా ముగింపు పలికాలని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ స్పష్టం చేశారు. అప్పటివరకు భారత్​ తన బలగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ అంశంపై చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'India will not reduce troops unless China initiates process'
'చైనా అలా చేస్తేనే భారత బలగాలు వెనక్కి'
author img

By

Published : Jan 23, 2021, 11:24 AM IST

తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చైనా అంగీకరిస్తే తప్ప.. భారత్​ తన బలగాలను ఉపసంహరించుకోదని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చల ద్వారా ఒక పరిష్కారం లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారాయన. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలపై చైనా అభ్యంతరం తెలపడాన్ని తప్పు పట్టిన రాజ్​నాథ్​.. మరింత​ వేగంగా భారత ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఓ మీడియా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాల గురించి మాట్లాడారు.

భారత బలగాల ఉపసంహరణపై మాట్లాడిన రాజ్​నాథ్.. మొదట చైనా ఆ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. నిర్ణీత గడువులోగా ప్రతిష్టంభనను తొలగించాలనే నియమమేదీ లేదన్న మంత్రి.. చైనాతో చర్చల ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు.

ఉన్నతస్థాయి చర్చలు..

జనవరి 19న ఉన్నత స్థాయి చర్చలకు చైనా ప్రతిపాదించిందని రాజ్​నాథ్​ తెలిపారు. అయితే సమావేశానికి ఒక్క రోజు ముందు సమాచారం అందిందని పేర్కొన్నారు. జనవరి 23 లేదా 24న తేదీలకు రీషెడ్యూల్​ చేయమని కోరామన్నారు. భారత్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉద్ఘాటించారు.

నమ్మకాన్నికోల్పోయిన డ్రాగన్..

అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా నిర్మిస్తున్న గ్రమాలపై రక్షణ మంత్రి స్పందించారు. ఆ గ్రామాలు సరిహద్దుల్లో చైనా వైపు నిర్మిస్తున్నవి మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే అవి గతంలోనూ ఉన్నాయని తెలిపారు. అయితే స్థానిక ప్రజలు, సైన్యం అవసరాల మేరకు భారత్​ సైతం వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణాలను వేగవంతం చేసిందన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా భారత్​-చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయన్న విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ వ్యాఖ్యలను సమర్థించిన రాజ్​నాథ్​.. దిల్లీ నమ్మకాన్ని బీజింగ్​ కోల్పోయిందన్నారు.

అవసరమైతే సవరణలు..

వ్యవసాయ చట్టాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అంశాల వారీగా చర్చలు జరగాలని.. తప్పనిసరైతే చట్టాల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చట్టాలను తాత్కాలికంగా వాయిదావేసే అవకాశాన్ని పరిశీలిస్తామని వ్యవసాయ మంత్రి ప్రతిపాదించారని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: మమ్మల్ని చంపేందుకు కుట్ర: రైతు నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.