2021 చివరి కల్లా దేశంలోని వయోజనులు మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితులు సమీక్షించేందుకు 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు.
"2021 ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో భారత్ 216 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఈ జులై కల్లా 51 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తుంది. రానున్న రోజుల్లో వైరస్ రూపాంతరం చెంది పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ ఎలాంటి మ్యుటెంట్లనైనా ఎదుర్కొనేలా వైద్య సౌకర్యాల ఏర్పాటు జరుపుతున్నాం."
--హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి.
మ్యూకర్మైకోసిస్ వ్యాప్తిని కూడా రాష్ట్రాలు దృష్టిలో ఉంచుకోవాలని హర్షవర్ధన్ సూచించారు. ఛత్తీస్గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్, ఛండీఘడ్, దాద్రా నగర్ హవేలి, దీవ్, లద్దాఖ్, లక్ష్యద్వీప్ ప్రాంతాల్లో కొవిడ్ కట్టడికి చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.
ఇదీ చదవండి:యాంటీబాడీల నిర్ధరణకు డీఆర్డీఓ 'కిట్'