ETV Bharat / bharat

జులైలో 13.45కోట్ల మందికి టీకా పంపిణీ - ఇండియా టీకా పంపిణీ

దేశవ్యాప్తంగా జులై నెలలో 13.45 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. సగటున 43.41 లక్షల మందికి రోజూ వ్యాక్సిన్లు అందించినట్లు వెల్లడించింది.

vaccine distribution
వ్యాక్సినేషన్
author img

By

Published : Aug 7, 2021, 8:25 PM IST

దేశంలో టీకా పంపిణీ నెలనెలా శరవేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. జులై నెలలో 13.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంటే సగటున రోజుకు 43.41లక్షల మందికి టీకాలు వేశామని కేంద్రమంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

"కొవిడ్‌పై పోరులో భారత్‌ రోజురోజుకీ మరింత బలంగా తయారవుతోంది. ప్రతి నెలా వ్యాక్సినేషన్‌ వేగంగా పెరుగుతోంది. జులైలో సగటున రోజుకు 43.41లక్షల మందికి డోసులకు అందించగా.. మొత్తంగా ఆ నెలలో 13.45 కోట్ల డోసులు అందించాం" అని మాండవీయ తెలిపారు.

ఇప్పటికే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దేశం అరుదైన మైలురాయిని అధిగమించింది. టీకా పంపిణీలో 50 కోట్ల మార్క్‌ను దాటింది. శనివారం ఉదయం నాటికి 50,10,09,609 మంది టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసే దిశగా మరో టీకాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశంలో మొత్తం ఐదు టీకాలు అందుబాటులోకి వచ్చినట్లయింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.